A PHP Error was encountered

Severity: 8192

Message: str_replace(): Passing null to parameter #3 ($subject) of type array|string is deprecated

Filename: common/article_header.php

Line Number: 3

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 3
Function: str_replace

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 51
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

AI Technology : బ్లాక్‌ అండ్‌ వైట్‌ పెళ్లి ఫొటోలతో కలర్‌ఫుల్‌ వీడియో | AI CREATS OLD WEDDING PHOTOS TO COLOURFULL VIDEO IN BANGLORE - Newsline Telugu
AI Technology : బ్లాక్‌ అండ్‌ వైట్‌ పెళ్లి ఫొటోలతో కలర్‌ఫుల్‌ వీడియో 2024-06-25 15:54:51

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు పెళ్లి( MARRIGE) అంటే ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారు..పెళ్లి ముందు పొటోలు ...పెళ్లి తర్వాత ఫొటోలు..అసలు పెళ్లి తంతు అంతా ఫొటోలే. అయితే ఈ సందడి పాతతరం వాళ్లకి లేదు. బ్లాక్ అండ్ ఫొటోస్ ను ఎఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) టెక్నాలజీతో లేనిది ఉన్నట్టుగా క్రియేట్‌ చేసుకునే వీలుంది. ఈ టెక్నాలజీ సాయంతో యువత కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. 


కేరళకు( KERALA) చెందిన ఆ యువకుడి పేరు అశ్విన్‌(ASHWIN). బెంగళూరులోని (BANGLORE) ఓ ప్రైవేటు కంపెనీలో విజువల్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఎఐ టెక్నాలజీని ఉపయోగించి.. తన తల్లిదండ్రుల్ని సర్‌ప్రైజ్‌ చేశాడు. తన తల్లిదండ్రుల బ్లాక్‌ అండ్‌ వైట్‌ పెళ్లి ఫొటోలను… ఎఐ( AI )  టెక్నాలజీతో కలర్‌ఫుల్‌ పెళ్లి వీడియోను రూపొందించాడు.  ఆ పేరెంట్స్ ఆనందానికి అవధులు లేవనుకొండి.ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


అశ్విన్‌ తల్లి మణి. తండ్రి సిగ్ని దేవరాజ్‌. తండ్రి పెయింటర్‌గా పనిచేస్తున్నారు. వీరి వివాహం ఏప్రిల్‌ 28, 1985లో జరిగింది. వివాహ సమయంలో వారిద్దరూ దండలు మార్చుకున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలను పాటలతో సరికొత్త వీడియోను రూపొందించాడు. ఈ వీడియోలో సందర్భానికి తగ్గట్టుగా ‘నలదమయంతా కథ కారయన్నం విలే..’ అనే పాటను జోడించారు. అశ్విన్ టాలెంట్ కు జనాలు తెగ సంబరపడిపోతున్నారు.