ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు తినిపించే ఫుడ్ విషయంలో చాలా చేంజ్ అయింది. చిన్నపిల్లల నుంచి మొదలు స్కూలుకు వెళ్లే పిల్లల వరకు సరైన ఆహారం తినిపించకుండా ఎక్కువగా బిస్కెట్లు,
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు తినిపించే ఫుడ్ విషయంలో చాలా చేంజ్ అయింది. చిన్నపిల్లల నుంచి మొదలు స్కూలుకు వెళ్లే పిల్లల వరకు సరైన ఆహారం తినిపించకుండా ఎక్కువగా బిస్కెట్లు, చాక్లెట్స్ లాంటివి ఇస్తున్నారు. స్కూల్ బాక్స్ లో కూడా బిస్కెట్లు పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. సాధారణంగా బిస్కెట్లు తింటే పిల్లలు బలంగా తయారవుతారని తల్లిదండ్రులు నమ్ముతారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదట. బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట.
బిస్కెట్లలో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు, సోడియం, పొటాషియం, అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందట. మరి అలాంటి బిస్కెట్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలు బిస్కెట్లు రుచిగా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాదు తరచూ బిస్కెట్లే కావాలని మారం చేస్తారు. ఇక వారిని కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులు బిస్కెట్లు తీసుకువచ్చి పిల్లల ముందు పెడతారు. దీనివల్ల పిల్లల్లో జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందట. బిస్కెట్ తయారు చేయడానికి ఉపయోగించే మైదా, గోధుమపిండి ఆరోగ్యానికి మంచిది కావు. వీటిని తరచూ శుద్ధి చేయడం వల్ల వాటిలోని పోషకాలు పోతాయట. మైదాపిండి తరచూ తింటే ఎంత డేంజరో మనందరికీ తెలుసు. బిస్కెట్లు తరచూ తినడం వల్ల పిల్లల్లో జీర్ణక్రియ నెమ్మధిస్తుందట. పిల్లల ప్రేగుల పనితీరును కూడా నెమ్మది చేస్తుందని. ముఖ్యంగా ఎదుగుతున్నటువంటి పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు ఇవ్వడం మంచిది కాదని, ఆ బిస్కెట్లకు బదులు ఏదైనా ఫ్రూట్స్ అందించి వారికి తినబెట్టాలని తెలియజేస్తున్నారు.
అలాగే బిస్కెట్ లో శుద్ధి చేసిన చక్కర ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్న తర్వాత శరీరంలో కేలరీలు పెరిగిపోతాయి. దీనివల్ల టైప్ 2, డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల మలబద్ధక సమస్యలు, వీటిలో ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వు వల్ల నోటికి రుచిగా అనిపించి పిల్లల్ని బిస్కెట్లకు బానిసగా తయారుచేస్తాయట. ఇలా ఎక్కువగా తినడం వల్ల పిల్లల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగి బరువు కూడా పెరుగుతారని నిపుణులు అంటున్నారు.