ఆషాడం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటలకు ఎడబాటు. ఈ ఆషాడ మాసం వస్తే కొత్తగా పెళ్లయినటువంటి జంటల్లో వధువు తన తల్లి గారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆషాడం వస్తే ఆమె భర్తను విడిచి ఎందుకు వెళ్తుంది. దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాంప్రదాయం ప్రకారం కాకుండా సైన్స్ ప్రకారం చూస్తే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన దంపతులను దూరం ఉండాలని అంటారు. దీనికి ప్రధాన కారణం ఆషాడ మాసంలో వధువు నెల తప్పితే ప్రసవ సమయము అనేది మార్చి లేదా ఏప్రిల్ లో ఉంటుంది. ఆ టైంలో విపరీతంగా ఎండలు కొడతాయి. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా వేసవికాలంలో సాధారణ ప్రసవం జరిగితే అధిక రక్తస్రావం కూడా జరుగుతుందట. ఈ సాంప్రదాయం అనేది ఎక్కువగా పూర్వకాలంలోనే ఉండేది. అప్పట్లో నార్మల్ డెలివరీలు అయ్యేవారు. ఎక్కువగా ఆసుపత్రులు ఉండేవి కావు. కాబట్టి పుట్టిన బిడ్డకు ఏదైనా ఇబ్బందులు అయితే ఎలాగా, అని ఆలోచన చేసి సాంప్రదాయం పేరుతో ఆషాడంలో కొత్త దంపతులు కలవకూడదని ఒక నియమాన్ని తీసుకొచ్చారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆషాడం వచ్చిందంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ మొదలవుతుంది. కానీ ఆషాడం వస్తే మరోకటి కూడా జరుగుతుంది. అదేంటంటే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటలకు ఎడబాటు. ఈ ఆషాడ మాసం వస్తే కొత్తగా పెళ్లయినటువంటి జంటల్లో వధువు తన తల్లి గారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆషాడం అయిపోయే వరకు అక్కడే ఉంటుంది. ఆషాడం వస్తే ఆమె భర్తను విడిచి ఎందుకు వెళ్తుంది. దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ సంప్రదాయం ప్రకారం ఈ నెల రోజులు అత్తా కోడలి మొహం, కోడలు అత్త మొహం చూడకూడదు అంటారు. అలాగే భర్త మొహం కూడా భార్య చూడకూడదు అని అంటుంటారు. ఇది పూర్వకాలం నుంచి మన పెద్దలు చెప్తున్నటువంటి మాట. కానీ మన పెద్దలు చెప్పిన దాని వెనుక తప్పనిసరిగా ఏదో ఒక సైన్స్ అయితే దాగి ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం కాకుండా సైన్స్ ప్రకారం చూస్తే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన దంపతులను దూరం ఉండాలని అంటారు. దీనికి ప్రధాన కారణం ఆషాడ మాసంలో వధువు నెల తప్పితే ప్రసవ సమయము అనేది మార్చి లేదా ఏప్రిల్ లో ఉంటుంది.
ఆ టైంలో విపరీతంగా ఎండలు కొడతాయి. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా వేసవికాలంలో సాధారణ ప్రసవం జరిగితే అధిక రక్తస్రావం కూడా జరుగుతుందట. ఈ సాంప్రదాయం అనేది ఎక్కువగా పూర్వకాలంలోనే ఉండేది. అప్పట్లో నార్మల్ డెలివరీలు అయ్యేవారు. ఎక్కువగా ఆసుపత్రులు ఉండేవి కావు. కాబట్టి పుట్టిన బిడ్డకు ఏదైనా ఇబ్బందులు అయితే ఎలాగా, అని ఆలోచన చేసి సాంప్రదాయం పేరుతో ఆషాడంలో కొత్త దంపతులు కలవకూడదని ఒక నియమాన్ని తీసుకొచ్చారు.
కానీ రాను రాను ఈ నియమం సాంప్రదాయంగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో చాలామంది ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. నెలరోజులు భార్యాభర్తలు విడిపోయి ఉండాలంటే కష్టం. కాబట్టి ఈ నియమాలను ఇప్పుడు పాటించేవారు తక్కువ అయిపోయారు. అంతే కాదు ఆషాడంలో నేలతప్పిన కానీ వేసవిలో వాళ్లు డెలివరీ అయిన ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉంటున్నాయి. కాబట్టి ఈ నియమాన్ని ప్రస్తుతం భార్యాభర్తలు దూరం పెడుతున్నారు కొంతమంది ఇంకా పాటిస్తూ వస్తున్నారు. మరి ఈ నియమాన్ని పాటించాలా? వద్దా? మీరు కామెంట్ రూపంలో చెప్పండి.