ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో అత్యంత సీనియర్ హీరో అంటే బాలకృష్ణ గుర్తుకొస్తారు. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన స్వర్ణోత్సవ
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో అత్యంత సీనియర్ హీరో అంటే బాలకృష్ణ గుర్తుకొస్తారు. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు టాలీవుడ్, బాలీవుడ్, ప్రముఖ హీరోలు, హీరోయిన్స్ అంతా హాజరు కానున్నారు. వీళ్లే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకకు రాబోతున్నారని తెలుస్తోంది.
అయితే ఇదే తరుణంలో బాలకృష్ణ తన కెరియర్ మొదట్లో పడ్డటువంటి ఇబ్బందుల గురించి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈయన స్కూల్లో చదువుతున్న సమయంలోనే ఎన్టీఆర్ సినిమా అయినటువంటి "తాతమ్మకల" చిత్రం ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాని డైరెక్ట్ గా ఎన్టీఆర్ నిర్మిస్తూ డైరెక్షన్ కూడా చేశారట. 1974లో ఈ సినిమా థియేటర్ లోకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు అనేక ఇబ్బందులు పడ్డారట. ఈ చిత్రం 2 నెలల పాటు బ్యాన్ కూడా అయింది. ఈ విధంగా బాలకృష్ణ మొదటిసారి నటించిన సినిమాని ఇన్ని ఇబ్బందుల మధ్య రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే ముగ్గురు వద్దు, ఇద్దరు ముద్దు అనే కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం సాగుతున్నది. అయితే ఈ సినిమాలో దానికి వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో కథ ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎంతమంది పిల్లలు అయినా కనండి అది తల్లిదండ్రుల ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం కాదు అనే డైలాగ్స్ ఉంటాయి. ఈ విధంగా సెన్సార్ వాళ్లు కూడా ఈ డైలాగు విని గవర్నమెంట్ నుంచి ఇబ్బందులు వస్తాయని సినిమాను నిలిపివేశారట.
చివరికి ఎన్టీఆర్ అసెంబ్లీలో పోరాడి ఈ సినిమాను రెండు నెలల తర్వాత రిలీజ్ చేయగలిగారు. అలాంటి ఈ చిత్రం రిలీజ్ అయి నేటికీ 50 ఏళ్లు పూర్తయింది. ఈ విధంగా ఈ సినిమాకు సంబంధించిన వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.