న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రైలులో ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్నపుడు...దర్జాగా వాళ్లు ఇచ్చే బెడ్ షీట్స్ ను కప్పుకుంటారు. వాళ్లు ఇస్తారని మనం ఇంటి నుంచి తీసుకొని వెళ్లం కూడా. కాని అసలు విషయం తెలిస్తే ఇక ట్రైన్ లో దుప్పట్లు ముట్టుకోను కూడా ముట్టుకోరు. రైల్వే లో దుప్పట్లు నెలకొక సారి వాష్ చేస్తారనే ఈ విషయాన్ని స్వయంగా రైల్వేనే వెల్లడించింది. ఏసీ ప్రయాణికులకు అందించే దుప్పట్లను ఎన్ని రోజులకు ఉతుకుతారంటూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే ఇలా విస్తుపోయే సమాధానం ఇచ్చింది.
ప్రతి ప్రయాణం అయిన తర్వాత ఏసీ ప్రయాణికులు వాడిన దుప్పట్లు ...నీట్ గా మడతపెట్టి కవర్ లో పెట్టి బెడ్ షీట్స్ , తలగడ రైల్వే అందిస్తుంది. తెల్లగా ఉండే ఇవి చూడగానే నీట్ గా ఉన్నాయనుకుంటారు. కాని నీట్ గా ఫోల్డ్ చేస్తారు అంతే.బెడ్‌షీట్, పిల్లో కవర్‌ను మాత్రం ఉపయోగించిన ప్రతిసారీ ఉతుకుతారట. కానీ, దుప్పట్లను మాత్రం నెలకు ఒకటి, రెండుసార్లు మాత్రమే వాష్ చేస్తారట. అంటే ఆ దుప్పటి ఎంతోమంది ప్రయాణికుల శరీరాలను వెచ్చబరిచిన అనంతరం మన వద్దకు వస్తుందన్నమాట. బెడ్ షీట్స్ అంటే తెల్లటి దుప్పట్లు మాత్రం రోజు వాష్ చేస్తారు. అదే నల్లటి రగ్గులు మాత్రం నెలకు ఒక్కసారి మాత్రమే ఉతుకుతారు.
రైలు జర్నీ పూర్తయిన తర్వాత పిల్లో కవర్, బెడ్‌షీట్‌ను లాండ్రీకి పంపిస్తారు. కానీ, దుప్పట్లను మాత్రం మళ్లీ చక్కగా ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచుతారు. అవి మురికిగా కనిపించినా, వాసన వస్తున్నా అప్పుడు మాత్రమే వాటిని లాండ్రీకి పంపిస్తారట. ఇది తెలిశాక ఇక దుప్పటి మనమే తీసుకొని వెళ్తే సరిపోతుంది అనిపిస్తుంది.