uttarpradesh: పోలీసుల పంచాయితీ తీర్చిన గేదె

ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో పోలీసుల నాలుగు గంటలు పాటు...కూర్చున్నా ..తీర్చలేని గొడవని జస్ట్ పది సెకన్లలో ఓ గేదె తీర్చేసింది. ఇంతకీ గొడవ ఎవరిది అంటారేమో...గొడవ కూడా గేదె దే. 
ఏం జరిగిందంటే.. జిల్లాలోని రాయ్ అస్కరాన్ పూర్ గ్రామానికి చెందిన నంద్ లాల్ సరోజ్ కు చెందిన ఓ గేదె మూడు రోజుల కిందట దారితప్పింది. మేత కోసం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకుండా కొంత దూరంలో ఉన్న పురే హరికేష్ అనే గ్రామంలో సంచరించింది. దీన్ని గమనించిన హనుమాన్ సరోజ్ అనే గ్రామస్తుడు దాన్ని పట్టుకొని ఇంట్లో కట్టేసుకున్నాడు. 


Published Jul 06, 2024 03:00:00 PM
postImages/2024-07-06/1720258236_mcms.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో పోలీసుల నాలుగు గంటలు పాటు...కూర్చున్నా ..తీర్చలేని గొడవని జస్ట్ పది సెకన్లలో ఓ గేదె తీర్చేసింది. ఇంతకీ గొడవ ఎవరిది అంటారేమో...గొడవ కూడా గేదె దే. 
ఏం జరిగిందంటే.. జిల్లాలోని రాయ్ అస్కరాన్ పూర్ గ్రామానికి చెందిన నంద్ లాల్ సరోజ్ కు చెందిన ఓ గేదె మూడు రోజుల కిందట దారితప్పింది. మేత కోసం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకుండా కొంత దూరంలో ఉన్న పురే హరికేష్ అనే గ్రామంలో సంచరించింది. దీన్ని గమనించిన హనుమాన్ సరోజ్ అనే గ్రామస్తుడు దాన్ని పట్టుకొని ఇంట్లో కట్టేసుకున్నాడు. గేదె అసలైన ఓనర్ మాత్రం మూడు రోజులుగా గేదె ఎటుపోయిందో అంటూ వెతుక్కుంటున్నాడడు. నంద్ లాల్.. ఎట్టకేలకు తన గేదె హనుమాన్ సరోజ్ వద్ద ఉందని గుర్తించాడు. తన గేదెను ఇవ్వాలని అడిగితే అది తన గేదె అని బుఖాయించాడు. దీంతో నంద్ లాల్ సమీపంలోని మహేష్ గంజ్ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించాడు.


పోలీసుల ముందు కూడా హనుమాన్ సరోజ్ నిజం చెప్పలేదు. నాలుగు గంటలు గొడవ పడినా ...పంచాయితీ మాత్రం తేలలేదు. చివరకు పోలీసులు గేదెను రోడ్డు మీద వదిలేయాలని సూచించారు. ఎవరి ఇంటికి గేదె వెళ్తే వారే దాని అసలైన యజమానిగా ప్రకటిస్తామన్నారు. ఇందుకు నంద్ లాల్, హనుమాన్ తోపాటు గ్రామస్తులు కూడా అంగీకరించారు. దీంతో వాళ్లిద్దరినీ పోలీసులు వారి గ్రామలకు వెళ్లే మార్గాలకు వ్యతిరేక దిశలో నిలబడాల్సిందిగా సూచించారు.


అనంతరం గేదెను స్టేషన్ నుంచి విడిచిపెట్టగా అది నేరుగా రాయ్ అస్కరాన్ పూర్ గ్రామం వైపు నంద్ లాల్ ను అనుసరిస్తూ వెళ్లింది. తన ఓనర్ ను గుర్తుపట్టి ...పంచాయితీ తేల్చింది . అంతేనా ఈ స్టోరీని పోలీసులు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అంతేకాదు..స్టోరీ విన్న వాళ్లంతా ఇదంతా అక్బర్ ...బీర్బల్ కథలా ..ఉందన్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news

Related Articles