Anasuya: లింగ మార్పిడి కోసం అనసూయ అప్లికేషన్!

ఈ మధ్య కాలంలో లింగమార్పిడీ కోసం అభ్యర్థించే వారి గురించి తరుచూ వింటున్నాం. ఈ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో ప్రముఖులు కూడా చేరుతున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-10/1720602965_WhatsAppImage20240710at14.30.19.jpeg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్య కాలంలో లింగమార్పిడీ కోసం అభ్యర్థించే వారి గురించి తరుచూ వింటున్నాం. ఈ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో ప్రముఖులు కూడా చేరుతున్నారు. తమ ఆలోచనలను బహిరంగంగా పంచుకుంటూ, స్వేచ్ఛాయుతమైన జీవనానికి ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పుడు ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఈ కోవలోకి చేరారు. లింగమార్పిడీకి అవకాశం ఇవ్వాలంటూ కేంద్రాన్ని అభ్యర్థించారు. ఇప్పుడిది సెన్సేషనల్ వార్త అయ్యింది. సివిల్స్ చరిత్రలోనే తొలి కేసుగా దీని గురించి చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడమే కాదు, టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయ్యింది. 

హైదరాబాద్‌కి చెందిన ఎం.అనసూయ.. IRS ఆఫీస‌ర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన జీవితంలో ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లింగ మార్పిడి కోసం అప్లయ్ చేసుకున్నారు. దీనికి కేంద్రం నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చింది. ఆమె అభ్యర్థనకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండియన్ సివిల్ సర్వీస్ చరిత్రలోనే ఇది మొదటిసారి అని చెబుతున్నారు.

మహిళగా ఉన్న తాను పురుషుడిగా మారాలనుకుంటున్నానని రిక్వెస్ట్ పెట్టుకోగా ఆర్ధిక శాఖ అనుమతినిచ్చింది. దీంతో ఆ ఆఫీసర్ తన పేరును M అనుకత్తీర్ సూర్య‌గా మార్చుకున్నారు. 2013లో సివిల్స్‌కు ఎంపికైన ఆమె చెన్నై కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2018‌లో పదోన్నతి‌పై హైదరాబాద్‌కు బదిలీ‌పై వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : hyderabad viral-news anasuya

Related Articles