రేవంత్ రెడ్డిని చుసి కాంగ్రెస్ నేతలు కూడా అదే విధంగా మితిమీరి నడుచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నందుకు విబేధాలు ఉన్నా.. రాష్ట్రానికి తొలి సీఎం అయినందుకు ఆయనకు కనీస గౌరవం ఇవ్వాలని ప్రజలు కూడా అంటున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది. ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ ఆహ్వాన పత్రికను తయారు చేశారు. దీంతో దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
మెదక్ జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో కేసీఆర్ పేరును ఎమ్మెల్సీలు, ఇతర ఎమ్మెల్యేల తర్వాత చేర్చారు. తెలంగాణ ఉద్యమ నాయకుడైన ఆయన పేరును ఈ విధంగా చివర్లో ఉంచడంపై BRS పార్టీ వర్గాలతో పాటు కేసీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి వరకు ఎక్కడ సభ పెడితే అక్కడ రేవంత్ బూతులు మాట్లాడేవారు. అయితే, రేవంత్ రెడ్డిని చుసి కాంగ్రెస్ నేతలు కూడా అదే విధంగా మితిమీరి నడుచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నందుకు విబేధాలు ఉన్నా.. రాష్ట్రానికి తొలి సీఎం అయినందుకు ఆయనకు కనీస గౌరవం ఇవ్వాలని ప్రజలు కూడా అంటున్నారు.
మరోవైపు ఆహ్వాన పత్రికలో చివర్లో పెట్టి రేవంత్ సర్కార్.. తమ కుంచిత స్వభావాన్ని మరొక్కసారి బయపెట్టుకుందని పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వింత చేష్టలు, విపరీత బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు.. సమయం వచ్చినప్పుడు తగురీతిలో జవాబు చెబుతారని మరికొందరు పార్టీ అభిమానులు అంటున్నారు.