పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ దేవర. సోషల్ ఫాంటసీ కథా నేపథ్యంలో ది గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించారు. అలాంటి ఈ చిత్రం సెప్టెంబర్ 27వ
న్యూస్ లైన్ డెస్క్: పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ దేవర. సోషల్ ఫాంటసీ కథా నేపథ్యంలో ది గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించారు. అలాంటి ఈ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. ఇదే తరుణంలో సినిమాకు సంబంధించిన అనేక ప్రమోషన్స్ చిత్ర యూనిట్ చేపడుతున్నారు.
అయితే తెలుగులో దేవర సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబడుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇక తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ చిత్రం అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబడుతుందట. దీనికి ప్రధాన కారణం ఎన్టీఆర్ కు ఉన్నటువంటి పేరు మరియు జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నారు కాబట్టి హిందీలో కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.
దాదాపు మొదటి రోజు 8 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు. ఒకవేళ కలెక్షన్స్ వారు అనుకున్నట్లుగానే వస్తే మాత్రం దేవర సినిమా సంచలనమైన విజయం సాధించే అవకాశం ఉంటుంది. మరి చూడాలి మూవీ విడుదలై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.