diwali: దివాళీ పండుగ ఎప్పుడు చేసుకోవాలి..అక్టోబర్ 31 లేక నవంబర్ 1 ?

దీపావళి ఒక్క రోజు పండుగ కాదు. ఐదు రోజుల పండుగ.ఈ వేడుకల్లో భాగంగా లక్ష్మీ దేవి, రాముడు, కృష్ణుడు, నాగేంద్రుడుని ఆరాధిస్తారు


Published Oct 28, 2024 01:29:00 PM
postImages/2024-10-28/1730102539_diwali.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దీపావళి అమావాస్య చీకట్లు పారదోలి లైఫ్ లో వెలుగులు నింపే సంతోషాల సంబరం చిన్నా పెద్దా తేడా లేకుండా మతాబుల వెలుగులను సంబరంగా ఆనందించే పండుగ దీపావళి. అయితే దీపావళి ఒక్క రోజు పండుగ కాదు. ఐదు రోజుల పండుగ.ఈ వేడుకల్లో భాగంగా లక్ష్మీ దేవి, రాముడు, కృష్ణుడు, నాగేంద్రుడుని ఆరాధిస్తారు. ఈ ఐదు రోజుల పండగ ధనత్రయోదశి షాపింగ్​తో మొదలై.. నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి, భాయిదూజ్​తో పూర్తవతుంది. ఈ ఏడాది ప్రతి పండుగ రెండు రోజులే. అయితే ఈ పండుగ ఎప్పుడెప్పుడు ఏం చేసుకోవాలి.


* ఇందులో తొలి రోజు ధన త్రయోదశి/ధంతేరాస్​​గా జరుపుకుంటాం. ఆశ్వయుజ మాసంలోని త్రయోదశి తిథి నాడు సముద్ర మథన సమయంలో ధన్వంతరి ఉద్భవించాడు. అప్పటి నుంచి ఈ ధనత్రయోదశి మొదలైందని పురాణాలు చెబుతున్నాయి.ఈ రోజు కొత్త వస్తువులు , బంగారం కొంటారు . అలా దీపాలను దానం చేస్తారు . ఈ సారి ధంతేరాస్ అక్టోబర్ 29 న వచ్చింది.


* నరక చతుర్దశి ..శ్రీ కృష్ణుడు, సత్యభామతో కలిసి లోక కంటకుడైన నరకాసురుడిని సంహరించాడు. అక్టోబర్​ 31వ తేదీ ఉదయం పూట ఈ పండుగ జరుపుకోవాలి.


* దీపావళి అమావాస్య: సత్యయుగంలో ఆశ్వయుజ మాసం అమావాస్యనాడు సముద్ర మథనం నుంచి తొలిసారిగా లక్ష్మీదేవి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్​ 31వ తేదీన సాయంత్రం దీపావళి పండగను జరుపుకోవాలని చెబుతున్నారు.


*బలి పాడ్యమి/గోవర్ధన పూజ: దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి.  కృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలు పై ఎత్తిన రోజు.. గుజరాతీయులకు నవంబర్ 2 ఉగాది లాగా.


* భగిని హస్త భోజనం..: ఇక చివరగా అన్నాచెల్లెళ్ల పండగను జరుపుకుంటారు. దీనినే భగిని హస్త భోజనం, యమ ద్వితీయ, భాయిదూజ్​గా కూడా పిలుస్తారు. పండగ ఈ ఏడాది నవంబర్ 3, 2024న జరుపుకోనున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu diwali diwali-arrangements

Related Articles