పురుగే కదా అని చీప్ గా చూడకండి..ధర 75 లక్షలు.!

ఈ  కీటకానికి ఏకంగా లక్షల రూపాయల ధర పలుకుతోంది. ఇంతకీ ఆ పురుగు ఏంటి దానికి అంత ధర ఎందుకు పలుకుతుంది దాని యొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. భూతల ప్రపంచంలోనే ఎక్కువ ఖరీదైనటువంటి కీటకాలలో స్టాక్ బీటిల్  ఒకటి. నిజానికి చెప్పాలంటే ఇది మన ఇండియాలో ఎక్కువగా కనిపించే కుమ్మరి పురుగు లేదంటే పెండ పురుగు లాంటిదే. దీనికి ఒక ప్రత్యేకత మాత్రం ఉంటుంది. దీని తలపై భాగంలో దుప్పులకు ఉన్నట్టు కొమ్ములు ఉంటాయి.  అందుకే వీటిని స్టాక్ బీటిల్ కీటకాలు అని పిలుస్తారు. ఈ పురుగులు అదృష్టాన్ని కలిగిస్తాయట. ఇది ఇంట్లోకి వస్తే తప్పనిసరిగా ఇంటి ఓనర్ కోటీశ్వరుడు అవుతాడట. అందుకే వీటిని ఎంత ధర అయినా పెట్టి కొంటూ ఉంటారు.ఈ కీటకాలను ఔషధాలు తయారీలో ముఖ్యంగా ఉపయోగిస్తారని తెలుస్తోంది.మీరు కూడా కోటీశ్వరులు కావాలంటే కీటకాన్ని తెచ్చుకొని పెంచుకోండి.


Published Jul 07, 2024 08:57:00 PM
postImages/2024-07-07/1720363722_stag.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో పాములకు తేళ్లకు  ఇతర క్రిమి కీటకాలకు కూడా డిమాండ్ పెరిగిపోతుంది. ముఖ్యంగా రెండు తలల పాముకు కోట్ల రూపాయలు వస్తున్నాయని ఒక ప్రచారం కూడా ఉంది. ఇదే తరుణంలో ఈ  కీటకానికి ఏకంగా లక్షల రూపాయల ధర పలుకుతోంది. ఇంతకీ ఆ పురుగు ఏంటి దానికి అంత ధర ఎందుకు పలుకుతుంది దాని యొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భూతల ప్రపంచంలోనే ఎక్కువ ఖరీదైనటువంటి కీటకాలలో స్టాక్ బీటిల్  ఒకటి. నిజానికి చెప్పాలంటే ఇది మన ఇండియాలో ఎక్కువగా కనిపించే కుమ్మరి పురుగు లేదంటే పెండ పురుగు లాంటిదే. దీనికి ఒక ప్రత్యేకత మాత్రం ఉంటుంది. దీని తలపై భాగంలో దుప్పులకు ఉన్నట్టు కొమ్ములు ఉంటాయి.  అందుకే వీటిని స్టాక్ బీటిల్ కీటకాలు అని పిలుస్తారు. ఈ పురుగులు అదృష్టాన్ని కలిగిస్తాయట.

ఇది ఇంట్లోకి వస్తే తప్పనిసరిగా ఇంటి ఓనర్ కోటీశ్వరుడు అవుతాడట. అందుకే వీటిని ఎంత ధర అయినా పెట్టి కొంటూ ఉంటారు. అలాగే ఈ కీటకం ఒక అరుదైనటువంటి జాతికి చెందినది. లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం  చెప్పిన వివరాల ప్రకారం   స్టాక్ బీటిల్ పురుగులు రెండు నుంచి 6 గ్రాముల మధ్య బరువు పెరుగుతాయట. ఇది మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జీవనం కొనసాగిస్తాయట.

అంతేకాకుండా ఈ కీటకాలను ఔషధాలు తయారీలో ముఖ్యంగా ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇవి చలి ప్రాంతాల్లో జీవించలేవు. ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి  కుళ్లిపోయిన చెట్లపై  జీవిస్తూ చెట్లలోని తీయని ద్రవాన్ని ఆహారంగా తింటాయి. మరి ముఖ్యంగా కుళ్లిపోయిన పండ్లను రసాన్ని సేవిస్తాయి. మీరు కూడా కోటీశ్వరులు కావాలంటే కీటకాన్ని తెచ్చుకొని పెంచుకోండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu stag-beetle billionaire natural-history-musiam

Related Articles