మనం తెలుసుకోవడానికి ఉపయోగపడితే ..సృష్టి మనిషి మనుగడనే తయారుచేసింది. ఎంత వాదించినా ...ఏదో మూల శక్తి మానవజాతిని బ్రతికిస్తుంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పని ఏదైనా ..నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మీరు నిజంగా నమ్మితే ...మంత్రాలకు చింతకాయలు కూడా రాలతాయి. మీరు నమ్మకపోతే వజ్రాలు రాలినా రాళ్లే అవుతాయి. సృష్టి లేని మనిషి లేడు..మనిషి లేనిది సైన్స్ లేదు. సైన్స్ మనల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడితే ..సృష్టి మనిషి మనుగడనే తయారుచేసింది. ఎంత వాదించినా ...ఏదో మూల శక్తి మానవజాతిని బ్రతికిస్తుంది. ఇంతే .. ఇందులో భాగంగానే ప్రతి కోరికకు ఓ మంత్రం ఉంటుంది. ఆ మంత్రజపం చేయడం వల్ల ...మనలో దాగిన మన శక్తి ఉత్తేజింపబడుతుంది.
* పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు షష్టి దేవి స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, హయగ్రీవ స్తోత్రం, సరస్వతి స్తోత్రం లాంటివి చదవాలి. అప్పుడు పిల్లల కెరియర్ బాగుంటుంది. షష్టి దేవీ స్తోత్రం పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ షష్టి దేవిని పూజించాలి. అంతేకాదు ...పిల్లల విషయంలో మంత్రాలే కాదు ప్రత్యేక శ్రధ్ధ కూడా ఉండాలి.పిల్లల విషయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి . ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
1. పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వండి.
2. అతిగా టి.వీలను చూడనీయవద్దు. ఎదిగే పిల్లలపై టి.వీ. ప్రభావం విపరీతంగా ఉంటుంది.మీ పిల్లల క్రియేటివిటీ ని తగ్గిస్తుంది.
3. చక్కటి నిద్రవారి బుద్ధి ఎదగడానికి సహకరిస్తుంది.
4. ఏదేమైనా సూర్యోదయం ముందుగానే నిద్రలేపండి.
5. ఉదయం మరియు రాత్రి తప్పనిసరిగా పళ్ళుశుభ్రం చేసుకునేలా మీరు అలవాటు చేయించండి.
6.ప్రతి దినమూ తప్పనిసరిగా మలవిసర్జన చక్కగా అవుతున్నదో లేదో గమనిస్తూ ఉండాలి. మల విసర్జన కచ్చితంగా ప్రతిరోజూ చక్కగా జరిగే పిల్లలు ఇతర పిల్లలకన్నా జ్ఞానవృద్ధి కలిగి ఉంటారు.