పంటను అధికారులు గొర్రెలతో మేయించారని.. దీంతో పంట పూర్తిగా నాశనమైందని వాపోయారు. అధికారులను వివరణ కోరగా అది అటవీ భూమి అని, అందులో అనుమతి లేకుండా పంట వేసినందుకు చర్యలు తీసుకున్నామని చెబుతున్నారని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఫారెస్ట్ అధికారుల ఆగడాలు భరించలేక ఓ అన్నదాత ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండల పరిధిలోని రాయపాడ్ తండాకు చెందిన రైతు జ్ఞానేశ్వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు సాగు చేస్తున్న పంటను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేశారని ఆవేదనతో జ్ఞానేశ్వర్ పురుగుల మందు తాగాడని అన్నారు.
పంటను అధికారులు గొర్రెలతో మేయించారని.. దీంతో పంట పూర్తిగా నాశనమైందని వాపోయారు. అధికారులను వివరణ కోరగా అది అటవీ భూమి అని, అందులో అనుమతి లేకుండా పంట వేసినందుకు చర్యలు తీసుకున్నామని చెబుతున్నారని అన్నారు. ఇక చేసేదేమీ లేక పంట చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని వాపోయారు. జ్ఞానేశ్వర్‌ను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.