Lightning: జస్ట్ మిస్ రా నాయనా...పిడుగుపడి సచ్చిపోతుండే 2024-06-27 12:02:27

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భగవంతుడు రక్షించాలనుకుంటే ...మంటల్లో కూడా నీకు దారి దొరికి బయటకొస్తావ్.. దానికి చాలా ఉదాహరణలు చూసే ఉంటాం. అందులో ఈ సంఘటనను కూడా చేర్చుకోవల్సిందే.  బీహార్‌లో( BIHAR) ని సీతామర్హి( SEETHA MARHI) లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. వ‌ర్షం ప‌డుతున్న స‌మ‌యంలో ఇన్‌స్టా రీలు కోసం పొరుగింటి వారి టెర్రస్‌పైకి ఎక్కింది ఓ అమ్మాయి. అప్పుడే పెద్ద మెరుపు ..జస్ట్ మిస్ అంటూ పక్కన పడింది.


 సీతామర్హి ప‌రిధిలోని పరిహార్‌లోని సిర్సియా ( SIRSIYA BAZAR) బజార్‌లో సానియా కుమారి( SANIYA KUMARI)  అనే బాలిక‌ తన పొరుగున ఉండే దేవనారాయణ్ భగత్ ఇంటి టెర్ర‌స్‌పై వర్షంలో డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఆమె స్నేహితురాలు దాన్ని వీడియో తీస్తోంది. ఇంత‌లోనే సానియాకు సమీపంలోనే పిడుగు పడింది. అదృష్టవశాత్తూ ఆమెకు నేరుగా ఆ పిడుగు ప్ర‌భావం తగలకపోవడంతో ఎలాంటి ప్రమాదం జ‌ర‌గ‌లేదు. కాని కాస్త చెవి నొప్పి ..భయపడ్డానని మాత్రం చెబుతుంది.


బీహార్‌లోని( BIHAR) చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పిడుగుపాటు ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో బీహార్‌లోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుతో కనీసం 8 మంది చ‌నిపోయినట్లు బుధ‌వారం అధికారులు తెలిపారు. దీని బట్టి చూస్తే సానియా కుమారి చాలా లక్కీ అనే చెప్పాలంటున్నారు నెటిజన్లు.