ప్రియురాలు ఏకంగా ప్రియుడి కిడ్నాప్ కు పన్నాగం పన్నింది. ప్రేమ బంగారం గాను ...అంటూ అంతా నోరెళ్లబెట్టారు.సినీ ఫక్కీలో ఈ ప్లాన్ చేసింది. తిరుపతి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ రోజుల్లో ప్రేమ కు చాలా రకాల అర్ధాలున్నాయి. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్లకే తెలీదు. ప్రేమ ఎక్కువైన భరించలేము. ఓ యువతి.. ఓ యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ మూడు నెలలుగా వారిద్దరు ఎడముఖం పెడముఖంగా ఉండసాగారు. ఫోన్ చేసి చేసి చిరాకొచ్చి ...ప్రియురాలు ఏకంగా ప్రియుడి కిడ్నాప్ కు పన్నాగం పన్నింది. ప్రేమ బంగారం గాను ...అంటూ అంతా నోరెళ్లబెట్టారు.సినీ ఫక్కీలో ఈ ప్లాన్ చేసింది. తిరుపతి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
చిత్తూరు జిల్లా పెనుమూరు సమీపంలోని రేణుకానగర్‌కు చెందిన శ్రీనివాసులు అలియాస్ నాని (31) తిరుపతిలో పెద్దకాపు వీధిలోని పార్థ డెంటల్ ఆసుపత్రి ఎదురుగా పీకే లేఅవుట్లో లాడ్జి నిర్వహిస్తున్నాడు. పెళ్లి కాలేదు. ఆయనికి వివాహిత సోనియా భానుతో కొన్నాళ్లు క్రితం పరిచయం అయ్యింది. ఆమె భర్త ఇటీవల చనిపోయాడు. వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. 8 నెలలుగా సన్నిహితంగా ఉండసాగారు.
మదనపల్లెకి చెందిన ఐదుగురు యువకులతో కలిసి ఇన్నోవా కారులో గురువారం మధ్యాహ్నం తిరుపతికి వచ్చి నానిని కిడ్నాప్ చేశారు. ప్రత్యేక బృందంతో ఛేజింగ్ చేసి .. అన్నమయ్య జిల్లా వాయల్పాడు వద్ద వీరి కారును అడ్డగించి నానిని అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లెకి చెందిన బాబా ఫకృద్దీన్ , మోక్షిత్ , రాజేష్ , రియాజ్ , సందీప్ లుగా గుర్తించారు.