రాష్ట్ర సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు జీవో 46 బాధితులు కలిశారు.
న్యూస్ లైన్, హైదరాబాద్: రాష్ట్ర సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు జీవో 46 బాధితులు కలిశారు. 46 జీవో వల్ల గ్రామీణ విద్యార్ధులకు జరుగుతున్న నష్టంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు వివరించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. జీవో రద్దు, న్యూమరికల్ పోస్టులతో బాధితులకు న్యాయం చేయడంపై చర్చించారు. రాజకీయ భేషజాలకు పోకుండా జీవో రద్దుకు సహకరించాలని కోరారు. ఈ విషయంపై అసెంబ్లీ , శాసనసభ సబ్ కమిటీలో చర్చించాలని కోరారు. అవసరమైతే మళ్ళీ వచ్చి ఈ విషయాన్ని వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సాంకేతిక సమస్యలపై సమాలోచన చేయడానికి , ఏమైనా డాక్యుమెంట్లు తీసుకురావడానికి కూడా సిద్ధమని అన్నారు. అలాగే ఈ నెల 19న జీవో 46పై హైకోర్టులో జరిగే విచారణకు ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జనరల్ హాజరయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటూ 46 జీవో బాధితులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకొన్నారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు.
ఏనుగుల రాకేశ్ రెడ్డి, 46 జీవో బాధితులు చెప్పిన విషయాలపై సానుకులంగా స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో 46 శాసనసభ సబ్ కమిటీలో మెంబర్‌గా ఉన్న ఆయన ఈ విషయంపై కమిటీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.