పది గ్రాముల బంగారం 81,500 రూపాయిలకు చేరుకుంది. ఇది జీవితకాల గరిష్ఠమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ గణాంకాలు చెబుతున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : బంగారం మాట ఇక మధ్యతరగతి జనాలు మాట్లాడుకోరు. బంగారం ధర జీవితకాల గరిష్టానికి చేరుకుంది. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులప్పుడు కూడా బంగారం ఇంత దారుణంగా పెరగలేదు. కాని ఇఫ్పుడు పది గ్రాముల బంగారం 81,500 రూపాయిలకు చేరుకుంది. ఇది జీవితకాల గరిష్ఠమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇజ్రాయిల్ యుధ్దాల నెపంతో బంగారం పై పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి.
బుధవారం 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన పసిడి ధర రూ.500 మేర పెరిగి రూ.81,500కి చేరింది. ఇక 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.81,100కి పెరిగింది. ఇక కిలో వెండి రూ.1000 మేర పెరిగి రూ.1.02 లక్షలకు ఎగబాకింది. ఈ పెంపుతో మంగళవారం రూ.1.01 లక్షలుగా ఉన్న కిలో వెండి రూ.1.02 లక్షలకు చేరుకుంది.
ఇక 22 క్యారట్ల బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,410 వద్ద నడుస్తుంది. అన్ని రాష్ట్రాల్లోను ఇదే రేటు నడుస్తుంది.
నిజానికి జులై నెలలో బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ఆ ప్రభావంతో స్థానిక మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా 7 శాతం మేర తగ్గాయి. అయితే పండుగ సీజన్ డిమాండ్ , యూఎస్ లో వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ధంతేరాస్ తర్వాత మరింత తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు.