బంగారం ధరలు దిగి వస్తున్నాయి. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి పసిడి ధరలు వరుసగా తగ్గుతూ వస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్ : బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 3 రోజుల్లో గోల్డ్ రేట్ రూ.5,000 తగ్గింది. బంగారం మీద దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) తగ్గింపుతో బంగారు ఆభరణాలకు గిరాకీ పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల్లోనే 10 గ్రాముల గోల్డ్ రూ. 5వేలు.. వెండి ధర రూ.7వేలకు దిగొచ్చింది. తగ్గిన ధరల నుంచి లాభం పొందేందుకు ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులవైపు ఆసక్తి చూపే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. మరోవైపు బంగారం కొనేందుకు సామాన్యులు సైతం తొందర పడుతున్నారు.