అమ్మమ్మగారిల్లు ఒక ఎమోషన్. 90sలో పుట్టిన ప్రతి ఒక్కరికి అమ్మమ్మ గారి ఇల్లుతో ప్రత్యేకమైనటువంటి కనెక్టివిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మమ్మ గారి ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో కిడ్స్ కి అమ్మమ్మగారిల్లు, బంధువుల ఇల్లు అనేవి తెలియడం లేదు. కేవలం టెక్నాలజీ, సెల్ఫోన్ గేమ్స్, తప్ప ప్రేమ, ఆప్యాయత, అమ్మమ్మగారిల్లు, తాతయ్యతో గడిపేక్షణాలు ఏవి తెలియవు. అప్పట్లో వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ప్రతి ఒక్కరు అమ్మమ్మగారింటికి సూట్ కేస్ సర్దేవారు.
న్యూస్ లైన్ డెస్క్:అమ్మమ్మగారిల్లు ఒక ఎమోషన్. 90sలో పుట్టిన ప్రతి ఒక్కరికి అమ్మమ్మ గారి ఇల్లుతో ప్రత్యేకమైనటువంటి కనెక్టివిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మమ్మ గారి ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో కిడ్స్ కి అమ్మమ్మగారిల్లు, బంధువుల ఇల్లు అనేవి తెలియడం లేదు. కేవలం టెక్నాలజీ, సెల్ఫోన్ గేమ్స్, తప్ప ప్రేమ, ఆప్యాయత, అమ్మమ్మగారిల్లు, తాతయ్యతో గడిపేక్షణాలు ఏవి తెలియవు. అప్పట్లో వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ప్రతి ఒక్కరు అమ్మమ్మగారింటికి సూట్ కేస్ సర్దేవారు.
అలా వేసవి సెలవులు మొత్తం అక్కడే గడిపి ఆనందమైనటువంటి జ్ఞాపకాలను మదిలో నింపుకొని, మళ్ళీ ఇంటికి వచ్చేవారు. 90Sలో పుట్టిన ప్రతి ఒక్కరికి అమ్మమ్మ వారి ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అప్పట్లో పుట్టిన వీరంతా ప్రస్తుతం పెద్దవారైపోయారు పెళ్లిళ్లు అయిపోయాయి. ఇందులో ఎవరిని కదిలించిన వారికి అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నటువంటి జ్ఞాపకాలను చాలా ఎమోషనల్ గా చెబుతారు. కానీ ప్రస్తుత కాలం పిల్లలను సమ్మర్ వెకేశన్స్ కి బెస్ట్ ట్రిప్ ఏంటి అని అడిగితే వారు గోవానో లేదంటే ఏదైనా బీచ్ పేరు మాత్రమే చెబుతారు.
అదే 90Sలో పుట్టిన కిడ్స్ ని అడిగితే తప్పకుండా అమ్మమ్మ గారి ఇల్లు అని చెబుతారు. ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ రిత్యా సొంత ఇంటి వాళ్లతో మాట్లాడాలన్నా క్యాలెండర్ వైపు చూసి, ఎప్పుడు వీక్ ఎండ్ వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఎమోషన్స్ ని ఇంటర్నెట్ లో రిలేషన్స్ ని సోషల్ మీడియాలో వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పిల్లలకు అమ్మమ్మ గారి ఇంట్లో గడిపిన క్షణాలు అమ్మమ్మ గారి చేత తినే గోరుముద్దలు, ఆవకాయ పచ్చడి, ఆప్యాయంగా అమ్మమ్మ చెప్పే సూక్తులు, అమ్మమ్మ కొనిచ్చే పుల్ల ఐస్ క్రీమ్, గురించి అసలు తెలియవు.
పండగ వస్తే చాలు మామయ్యలు, అత్తమ్మలు, తాతయ్యలు ఇల్లంతా సందడిగా ఉండేది. అప్పట్లో ఉండే ఆ చిన్న ఇంట్లో అయిన అందరూ ఒకే దగ్గర ఉండి ఆనందంగా గడిపేవారు. కానీ ప్రస్తుతం పెద్దపెద్ద భవంతులు ఉన్న ఒక్కొక్కరికి ఒక్కరు రూము ఉన్న, ఆనందం మాత్రం కరువైపోయింది. ఓకే ప్లేట్ లో అన్నం కలిపి అందరికి అమ్మమ్మ తినిపించే గోరుముద్దలు మీలో ఎంతమందికి గుర్తున్నాయి.
కాలక్షేపానికి పిల్లలంతా కూర్చొని ఆడుకునే ఆటలు, రాత్రి అయితే అందరూ ఒక్క దగ్గర పడుకొని, సమయాన్ని మరిచిపోయి మరీ నిద్రించేవారు. మైండ్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా అమ్మమ్మగారింట్లో ఆనందంగా గడిపిన రోజులు ప్రస్తుతం జనరేషన్ పిల్లలకు తెలియవు. అమ్మమ్మ గారి ఇంట్లో మీరు ఎంతమంది గడిపారు. మీకు గుర్తు ఉన్నటువంటి అప్పటి క్షణాలను కామెంట్ ద్వారా తెలియజేయండి.