viral: పెళ్లి కోసం ఆఫీసర్ కు అర్జీ పెట్టుకున్న కుర్రాడు 2024-06-27 11:32:14

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఏం పెళ్లి రా   నాయనా...చేసుకున్నోళ్లకు ..టార్చర్ ...చేసుకోవాలనకున్నవాళ్లకు డ్రీమ్. అసలు ఈ ఆడపిల్లలకు ఏమైందో...ఏమో తెలీదు కాని ....తెగ ఎంచుతున్నారు. వ్యాపారాలు వద్దు..రైతు వద్దు...ఫైనాన్స్ చేస్తే వద్దు...షాప్ లో పనిచేస్తే వద్దు...మరి ఎవరు కావాలి...లక్షలు జీతం తెచ్చే ..ఎవడైనా ఓకే. మళ్లీ జీతం అంటే ...ఏ 40 వేలో 50 వేలో అనుకుంటారేమో.. మినిమమ్ 2 లక్షలు జీతం ఉంటేనే నవ్వుతూ పెళ్లికి ఓకే చెప్తున్నారు. కలికాలం.  పాపం ఇలాంటి గడ్డు పరిస్థితిని చూసి చిరాకేసి ఓ యువ రైతు ఏం చేశాడో తెలుసా ..


పదేళ్ల నుంచి జీవిత భాగస్వామి( life partner)  కోసం వెతుకుతున్నాడు ఓ రైతు.. కానీ.. పెళ్లి కావడం లేదు.. దీంతో మానసికంగా కుంగిపోయాడు..ఎక్కడికి వెళ్లినా పిల్లనివ్వం...ఉద్యోగమైతే బాగుండు ఇలాంటి మాటలు విని విని చిరాకేసినట్లుంది. దీంతో ఏకంగా ఆఫీసర్స్ కే అర్జీ పెట్టాడు. జనస్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరై.. పిల్లను వెతికిపెట్టాలంటూ కోరాడు.


కర్నాటకలోని( KARNATAKA)  కొప్పల్ ( KOPPAL) జిల్లాలో చోటుచేసుకుంది.. కర్నాటకలోని కొప్పల్ జిల్లాలో జనస్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరైన జిల్లా కమీషనర్ నళిని అతుల్‌ ( ATHUL) దగ్గరికి వెళ్లిన సంగప్ప.. తన ఆవేదనను వెల్లబుచ్చుకున్నాడు.. ఏం చేసైనా ...తనకు పెళ్లి కావాలని తన బాధంతా కక్కేసాడు. 
“సార్, నాకు గత 10 సంవత్సరాల నుండి పెళ్లికి కావడం లేదు. చాలా కాలంగా వెతుకుతున్నాను. దయచేసి నాకు వధువును కనుగొనడంలో సహాయపడండి. దయచేసి ఎవరైనా నాకు వధువును కనుగొనడానికి ఒక బ్రోకర్ ను కేటాయించి అతని ద్వారా సహాయం చేయండి”.. అని సంగప్ప తన విన్నపంలో పేర్కొన్నారు. ఇది అతని విన్నపం..సిల్లీగా ఉన్నా...సీరియస్ నోట్ .