పార్టీ మారిన ఎమ్మెల్యేల పిటిషన్ సంభందించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయవాది రామారావు ఇంమనేని స్పందించారు.
న్యూస్ లైన్ డెస్క్: పార్టీ మారిన ఎమ్మెల్యేల పిటిషన్ సంభందించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయవాది రామారావు ఇంమనేని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిరాయింపుల నిరోధక చట్టానికి లోబడి స్పీకర్ నిర్ణయం వెలువరించాలని ఆయన అన్నారు. రాజ్యానికి 52 సవరణ ద్వారా పార్టీ పిరయింపుల నిరోధక చట్టం ఏర్పడిందని తెలిపారు. ఆయా రామ్, గయా రామ్ ఈ పదం గాయ లాల్ ఆమె హర్యానా ఎంపీ ఒకే రోజు మూడుసార్లు పార్టీలు మారినప్పుడు 1967సంవత్సరంలో చట్టం చేయాలన్న చర్చ నడిచిందన్నారు. అప్పుడే చట్టం చేయాలన్న ఆలోచన వచ్చిందని ఆయన తెలిపారు.
దానం నాగేందర్ గెలిచిన పార్టీ ప్రాథమిక సభ్యత్వనికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేశారని, దానం విషయంలో స్పష్టత ఉందన్నారు. ప్రతివాధులు రిట్ అప్పీల్‌కు వెళ్లిన ఫలితం ఉండదని, స్పీకర్ పరిధిలోనే ఎమ్మెల్యే అనర్హత వ్యవహారం ఉందన్నారు. నాలుగు వారాల్లోపే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే కోర్టు జోక్యం తప్పనిసరి అని ఆయన అన్నారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి లోబడి ఉంటే కోర్టు జోక్యం చేసుకునే అవకాశం తక్కువ అని, నాలుగు వారాల్లో వెలువడనున్న స్పీకర్ నిర్ణయం మీదనే ఇప్ప్పుడు అందరి చూపు ఉందన్నారు. తీర్పు విషయంలో గతంలో మాదిరి జాప్యం ఉండక పోవచ్చుని రామారావు ఇమ్మనేని పేర్కొన్నారు.