భార్య చెల్లెలితో భర్త..మామతో తల్లి జంప్..ట్విస్ట్ మామూలుగా లేదు.! 2024-06-26 22:01:15

న్యూస్ లైన్ డెస్క్: అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే నవ్వాలో ఏడవాలో అస్సలు అర్థం కాదు. అసలు మనం భారతదేశంలోనే బ్రతుకుతున్నామా అనే అనుమానం కూడా కలగక మానదు. అలాంటిదే ఒక అనూహ్య ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్ లోని  ఫరీద్ పూర్ గ్రామానికి చెందిన సుధా కుమారి అనే అమ్మాయికి, మీరాజి భగత్ అనే వ్యక్తి కుమారుడు  చోటుతో 2021 లో వివాహం అయింది. వీరికి ఒక అమ్మాయి కూడా జన్మించింది. వివాహం తర్వాత వీరి కాపురం బాగానే సాగింది.

కానీ గత కొన్ని నెలలుగా సుధా కుమారి భర్త చోటు తన సొంత చెల్లెలితో ఫోన్ లో మాట్లాడడం గమనించింది. కానీ సుధా కుమారి క్యాజువల్ గా తీసుకుంది. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది. చివరికి జూన్ 2వ తేదీన  ఇద్దరు పెళ్లి చేసుకుని జంప్ అయిపోయారు. వెంటనే సుధా తన పుట్టింటికి వెళ్లి విషయాన్ని తల్లి ఫుల్ కుమారికి  చెప్పింది. దీంతో సుధా తల్లి కుమారి, సుధా అత్తారింటికి వెళ్లి విషయమేంటో తేల్చుకుంటానని చెప్పింది.

అలా వెళ్ళిన తల్లి వారం గడిచిన రాకపోవడంతో, ఫోన్ రెస్పాండ్ అవ్వకపోవడంతో, సుధా కూడా అత్తవారింటికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్లాక అసలు విషయం అర్థమైంది. సుధా తల్లి తన మామ భగత్ తో కలిసి   జంప్ అయిందట. వీరు ఢిల్లీలో కలిసి నివసిస్తున్నారని విషయం తెలుసుకుంది. చివరికి ఏం చేయాలో తెలియక పోలీసులు ఆశ్రయించి విషయం చెప్పింది. చివరికి సుధా కుమారి  భర్త లేక ఇటు తల్లి సపోర్టు లేక విపరీతంగా బాధపడుతోంది. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.