మన తాతల కాలంలో వివాహాలు అంటే చాలా వరకు అమ్మాయి అబ్బాయి మధ్య ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండేది. అబ్బాయి 25 సంవత్సరాలు ఉన్నా కానీ, అమ్మాయి 15, 16 సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. సాధారణంగా అబ్బాయి వయసులో సగం మాత్రమే అమ్మాయిలు ఉండేవారు. అలాంటి వివాహ వ్యవస్థ ప్రస్తుతం మారిపోయింది. చాలామంది ఏజ్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అబ్బాయి చిన్న వయసు ఉన్న అమ్మాయి పెద్ద వయసు ఉన్న పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..
న్యూస్ లైన్ డెస్క్: మన తాతల కాలంలో వివాహాలు అంటే చాలా వరకు అమ్మాయి అబ్బాయి మధ్య ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండేది. అబ్బాయి 25 సంవత్సరాలు ఉన్నా కానీ, అమ్మాయి 15, 16 సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. సాధారణంగా అబ్బాయి వయసులో సగం మాత్రమే అమ్మాయిలు ఉండేవారు. అలాంటి వివాహ వ్యవస్థ ప్రస్తుతం మారిపోయింది. చాలామంది ఏజ్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అబ్బాయి చిన్న వయసు ఉన్న అమ్మాయి పెద్ద వయసు ఉన్న పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..
సినీ తారలు, స్పోర్ట్స్ మ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ఇందులో మహేష్ బాబు కంటే నమ్రత రెండు సంవత్సరాలు పెద్దది, అలాగే సచిన్ టెండూల్కర్ కంటే తన భార్య వయసులో పెద్దది. ఇలా ఒకటి రెండు సంవత్సరాలు అమ్మాయి పెద్దదైనా కానీ, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. దేశంలోని అత్యంత ధనికుడైనటువంటి అంబానీ రెండవ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి తాజాగా ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. రాధిక మర్చంట్ ను ఈయన ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే అనంత్ అంబానీ కంటే రాధిక మర్చంట్ వయసులో పెద్దదట. ఆమె ఎంత పెద్దది వారి మధ్య, బంధం ఎలా కుదిరింది అనే వివరాలు చూద్దాం.
రాధిక అనంత్ చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. ఇది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. చివరికి జులై 12వ తేదీన అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య వయస్సు తేడా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెట్టింటా అందిన సమాచారం ప్రకారం అనంత్ అంబానీ 1995 ఏప్రిల్ 10న జన్మించారట. అంటే ఆయన వయసు 29 సంవత్సరాల మూడు నెలలు.
అలాగే రాధిక మర్చంట్ 1994 డిసెంబర్ 18న జన్మించిందట. ఈమె వయసు కూడా 29 సంవత్సరాల ఏడు నెలలు. ఇలా రాధిక అనంత్ అంబానీ కంటే నాలుగు నెలలు పెద్దది. కానీ వీరిద్దరూ కలిసి స్కూల్ నుంచి కాలేజీ వరకు చదువుకుంటూ వచ్చారు ఈ మధ్యలోనే ప్రేమ పుట్టి వివాహానికి దారి తీసింది. వీరి మధ్యలో ఏజ్ గ్యాప్ అనేది ఏ మాత్రం కనిపించడం లేదని చెప్పవచ్చు.