Express Train: ఇక పై జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు సికింద్రాబాద్ స్టాప్ రద్దు !

ఈ రైలు సికింద్రాబాద్ , బేగంపేట స్టేషన్ల వైపు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.


Published Mar 13, 2025 06:43:00 PM
postImages/2025-03-13/1741871660_train21741848940.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ స్టాప్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు రైల్వే అధికారులు . ఏప్రిల్ 25 నుంచి ఈ జన్మభూమి ఎక్స్ ప్రెస్ అమలులోకి వస్తుందని ఇండియన్ రైల్వే అధికారులు ప్రకటించారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం మధ్య ప్రతిరోజు నడుస్తుంది. ఈ రైలును దారి మళ్లిస్తున్నారు. చర్లపల్లి - అమ్ముగూడ- సనత్ నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 25 వ తేదీ నుంచి ఈ రైలు సికింద్రాబాద్ , బేగంపేట స్టేషన్ల వైపు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu secundrabad train railway-department sherlingam-pally

Related Articles