దీని పై జానీ మాస్టర్ స్పందించారు. అసలు నాకు ఎన్నికలు జరిగినట్లు కూడా తెలీదంటు తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన జానీమాస్టర్ మరోసారి వార్తల్లోకి వస్తున్నారు.. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయని, ఈ సంఘానికి నూతన అధ్యక్షుడు ఎన్నికవగా, జానీ మాస్టర్ ను శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి. దీని పై జానీ మాస్టర్ స్పందించారు. అసలు నాకు ఎన్నికలు జరిగినట్లు కూడా తెలీదంటు తెలిపారు.
తనను యూనియన్ నుంచి తొలగించినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు ఇంకా నిరూపితం కాలేదని, ఆరోపణల కారణంగా తనను యూనియన్ నుంచి తొలగించారని ప్రచారం చేస్తున్నారని వివరించారు.
యూనియన్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ఇంకా ఉందని, కానీ తనకు తెలియకుండా ఎన్నికలు నిర్వహించారని జానీ మాస్టర్ ఆరోపించారు. అనధికారికంగా నిర్వహించిన ఎన్నికలు చెల్లవని ..యూనియన్ పై తనకు ఇంకా హక్కుందని ..సొంత నిర్ణయాలు తీసుకొని హక్కు ఎవ్వరికి లేదని తెలిపారు.