ఇప్పటివరకు సూర్య 43 సినిమాల్లో నటించిన సూర్య కెరీర్ లో నష్టాలు తెచ్చిన సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సూర్య నటించిన కంగువ ..భారీ డిజాస్టర్ అయ్యింది. దీని వల్ల సూర్యకు దాదాపు 180 కోట్లు నష్టం వచ్చింది. అంతే సూర్య కెరీర్ లో డిజాస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి. కాని ఇదే టాప్ డిజాస్టర్ అని చెప్పాలి. సూర్యకు ఈ మధ్య కాలంలో హిట్లు లేవు. దాదాపు 11 యేళ్ల నుంచి సూర్యకు హిట్లు లేవు. మధ్యలో జై భీమ్ సూపర్ డూపర్ హిట్ . సింగం సీరిస్ తప్ప మరో హిట్టు లేదు. దాదాపుగా పెద్ద హిట్లు ఏం పడలేదు.
ఇప్పటివరకు సూర్య 43 సినిమాల్లో నటించిన సూర్య కెరీర్ లో నష్టాలు తెచ్చిన సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందులో చాలా వరకు సూర్య సినిమాలు లాస్ లే తెచ్చిపెట్టాయి. సూర్య సినిమాల్లో అంజాన్ 2014 లో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ , తర్వాత మాస్ సినిమా కూడా డిజాస్టరే.
సూర్య తన 2D ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా నొర్మించిన 24 సినిమా కూడా ఫ్లాపే. సింగం 3 హరి దర్శకత్వంలో సూర్య, అనుష్క, శృతి హాసన్, ఠాకూర్ అనూప్ సింగ్, రోబో శంకర్ నటించిన సింగం 3 (S3) 2017లో విడుదలైంది. బడ్జెట్ కు తగిన వసూళ్లు రాబట్టలేదు. నిజానికి సింగం సీరిస్ అన్నీ సూపర్ హిట్టే . కాని సింగం 3 థియేటర్ లో హిట్టు టాక్ వచ్చినా బడ్జెట్ మాత్రం పెట్టింది తిరిగి రాలేదు. అప్పుడు ఫ్లాపే కదా..అలా ప్లాప్ అయిన సినిమా. థాన సేర్ధ కూట్టం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య, కీర్తి సురేష్, కార్తీ, రమ్యకృష్ణ, సెంథిల్ నటించిన ఈ సినిమా 2018లో విడుదలైంది. అవినీతికి వ్యతిరేకంగా తీసిన ఈ సినిమా పూర్తిగా ఫ్లాప్ అయ్యింది.
ఇలా ఎన్జీకే కూడా ఫ్లాపే. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో పూర్తిగా రాజకీయ కథతో వచ్చిన ఈ సినిమా కూడా ఫ్లాపే. ఈ మూవీలో సాయిపల్లవి క్రేజ్ కాని సూర్య ఫేమ్ కాని పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇన్ని ఫ్లాపుల తర్వాత సూర్యకు కంగువ హిట్ట్ అనుకున్నారు కాని దాదాపు 2000 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలు వేసుకున్నారు. కాని మూవీ ఫ్లాప్ దాదాపు 350 కోట్లతో నిర్మించిన ఈ సినిమాలో దాదాపు ఈ సినిమా వల్ల 180 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చిందని చెబుతున్నారు. ఇంత నష్టం తర్వాత కూడా..సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నామని చెప్పడం మరీ దారుణం.