రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్న తీరుపై, రాజకీయ ప్రమేయం జోక్యం వలన ప్రతిపక్ష నాయకుల పైన పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, చేస్తున్న హింసపై డీజీపీకి ఫిర్యాదు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ నాయకులతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న దాడులపై డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం తిరుమలగిరిలో BRS పార్టీ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడి, ఇతర జర్నలిస్టులపైజరిగిన హత్యాయత్నంపై కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్న తీరుపై, రాజకీయ ప్రమేయం జోక్యం వలన ప్రతిపక్ష నాయకుల పైన పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, చేస్తున్నా హింసపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొన్న ఘటనను కూడా కేటీఆర్ డీజీపీ దృష్టికి తీసుకొని వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.