లడ్డుని చేసుకోబోయే అమ్మాయి ఈ ముగ్గురితో కలిసి వచ్చిన ఇంకో అబ్బాయితో లేచిపోతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: నార్నె నితిన్ , రామ్ నితిన్ , సంగీత్ శోభన్ , విష్ణు మెయిన్ లీడ్స్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి మెప్పించిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మూవీ మ్యాడ్ స్వ్కేర్ . శ్రీకర స్టూడియోస్ ,సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాణంలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ స్క్వేర్ సినిమా తెరకెక్కింది. అనుదీప్, రెబా మోనికా జాన్, సునీల్, సత్యం రాజేష్,ప్రియాంక జవాల్కర్, అనుదీప్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.
స్టోరీ లోకి వెళ్తే మ్యాడ్ కంటిన్యూస్ లో మూడేళ్ల తర్వాత స్టోరీ నడుస్తుంది. ఇంజనీరింగ్ అయ్యాక మనోజ్ బార్ టెండర్ గా అశోక్ వాళ్ల ఆస్తి కోసం పోరాడుతూ , డీడీ ఊళ్లో సర్పంచ్ అవ్వాలని ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. అయితే లడ్డు కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. ముగ్గురు కలిసి పెళ్లికి వెళ్తారు. కాని లడ్డుని చేసుకోబోయే అమ్మాయి ఈ ముగ్గురితో కలిసి వచ్చిన ఇంకో అబ్బాయితో లేచిపోతుంది.
దీంతో లడ్డు బాధలో ఉంటే ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి గోవాకు తీసుకొని వెళ్తారు. ఈ టైంలో గోవాలో ఓ వింటేజ్ నక్లెస్ పోతుంది. ఆ నక్లెస్ దొంగతనం కాస్త వీళ్ల ల మీద వేసి సునీల్ వీళ్లని బెదిరిస్తుంటాడు. అసలు అక్కడ ఏం జరిగింది. ఈ కేసు నుంచి ఎలా భయటపడ్డారు అనేదే స్టోరీ ..మధ్య మధ్యతో కామెడీతో సినిమా ఎంగేజింగ్ గానే ఉంది.ఫస్ట్ హాఫ్ లో మ్యాడ్ సినిమా రేంజ్ లో ఫుల్ గా నవ్వించారు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ నవ్వులు కాస్త తగ్గుతాయి. ప్రమోషన్స్ లో కథ, లాజిక్ లు వెతకొద్దు అని ముందే చెప్పేసారు. అవి వెతక్కపోయినా కామెడీ మాత్రం ఉండాలి. కాస్త సెకండ్ హాఫ్ లో కామెడీ లేక క్రైమ్ వల్ల స్లో అయిపోయింది. మ్యాడ్ సినిమాతో పోల్చకుండా చూస్తే పర్లేదు. పోలిస్తే మాత్రం సినిమా తేలిపోయింది.పవన్, ఎన్టీఆర్, మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా అక్కడక్కడా వారి రిఫరెన్స్ లు తీసుకున్నారు.రెబాకా మోనికా ఐటెం సాంగ్ లో అదరగొట్టింది.తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సింపుల్ కథ అయినా మంచి స్క్రీన్ ప్లేతో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. పంచ్ డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే సినిమా చాలా బాగుంది. మంచి టైం పాస్ .