Coins: భార్యకు భరణం ..ఇలా ఇచ్చాడేంటి..ఇందులో కూడా పగే !


 భార్యకు భరణం కింద రూ.80 వేలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. ట్యాక్సీ నడుపుతున్న తనకు అంత డబ్బు కష్టమని కోర్టు అంచనా వెయ్యలేదు.


Published Dec 21, 2024 09:45:00 PM
postImages/2024-12-21/1734797872_AA1wcxdO.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భార్య మీద అందరికి ప్రేమ ఉండదు..అందరికి కోపం కూడా ఉండదు. కాని కొంత మంది మాత్రం కావాలని తక్కువగా చూడడం..అందరి ముందు అవమానించడం లాంటివి చేస్తుంటారు. మరికొంతమందిని ఆడవాళ్లే ఇబ్బందిపెడుతుంటారు. ఈ కారణాలతోనే ఈ మధ్య విడాకులు చాలా కామన్ అయిపోతున్నాయి. రీసెంట్ తమిళనాడులో విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన ఓ జంట కు విడాకులు ఇప్పించారు . కాని విడాకులు ఇస్తూ తన భార్యకు భరణం ఎంత ఇవ్వాలో చెప్పింది. దీంతో ఒళ్లు మండిన ఆ వ్యక్తి భలే తమాషా పనిచేశాడు.


 భార్యకు భరణం కింద రూ.80 వేలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. ట్యాక్సీ నడుపుతున్న తనకు అంత డబ్బు కష్టమని కోర్టు అంచనా వెయ్యలేదు. దీంతో కోపం వచ్చి ...ఆ డబ్బును  అన్నీ రూ.2, రూ.1 నాణేలు తీసుకుని కోర్టుకు వచ్చాడు. సంచులకొద్దీ నాణేలు తీసుకువచ్చిన ఆ వ్యక్తిని చూసి న్యాయమూర్తి విస్తుపోయాడు. 


తమిళనాడులోని కోయంబత్తూరులో 37 ఏళ్ల ఓ వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 2023లో అతని భార్య ప్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోయంబత్తూరు అదనపు ఫ్యామిలీ కోర్టు... భార్యకు రూ.2 లక్షల మధ్యంతర భరణం చెల్లించాలని ఆ ట్యాక్సీ డ్రైవర్ ను ఆదేశించింది. భార్య పై కోపంతో ఈ పని చేశాడట. అయితే కోపంతో కోర్టు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. 20 సంచుల్లో నాణేలతో వచ్చిన ఆ వ్యక్తిని చూసిన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణేలు కాదు... వెళ్లి నోట్లు తీసుకురా అని తిప్పి పంపారు. దీంతో ఆ వ్యక్తి ఆ నాణాల సంచులు తిరిగి తీసుకొని వెళ్లిపోయాడు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce tamilnadu family court

Related Articles