Chhattisgarh: లేగ దూడను కావాలనే కారు ఎక్కించి చంపేశారు..వీడియో వైరల్! 2024-06-27 13:33:38

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఛత్తీస్‌గఢ్‌( CHATTISGARH) లోని బిలాస్‌పూర్‌లో( BILASPUR)  ఓ అమానుష ఘటన జరిగింది. ఇఫ్పుడు ఆ ఏరియా సీసీ టీవీ ( CC TV FOOTAGE)  పుటేజీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. రోడ్డుపై ఉన్న ఆవు దూడను( CALF)  ఓ వ్యక్తి జాలి లేకుండా కారు ఎక్కించి చంపేశాడు. రోడ్డుపై పడుకున్న లేగ‌దూడ‌పైకి అత‌డు కావాల‌నే తన హ్యుందాయ్ కారును ఎక్కించాడు. అంతేగాక రివ‌ర్స్ గేర్‌లో మ‌రోసారి దానిపైకి కారును తీసుకెళ్ల‌డంతో లేగ‌దూడ చ‌నిపోయింది. 


దారి మధ్యలో 7 నుంచి 8 ఆవులు ( COW) మార్గమధ్యంలో ఉన్నాయి. అటుగా వచ్చిన కారు..అక్కడ పడుకొని ఉన్న లేగదూడ పై నుంచి కారును పోనిచ్చాడు. చనిపోయి పడి ఉన్న దూడ దగ్గరికి మిగిలిన ఆవులన్నీ పరుగెత్తడం కూడా వీడియోలో ఉంది. ఇక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. 


కాగా, సీసీటీవీ ఫుటేజీ (CCTV FOOTAGE) ఆధారంగా కారు నంబర్‌ను తెలుసుకుని, ఆ వివరాల ఆధారంగా కారు యజమానిని షేక్ షాహిద్ గా గుర్తించారు. ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక హిందూ సంఘాలు కోరాయి. అయితే కారు డ్రైవర్ కు లేగదూడ కనిపించి ఉండదనే వాదన కూడా సోషల్ మీడియా లో జరుగుతుంది.