viral news: ఏం బాసు..ప్రేమ విఫలమైతే ఇలా అయిపోవాలా !

ఈ బ్రేకప్స్ బాధ పడలేక భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి మేకను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇంట్లో నానా తంటాలు పడి ఈ మేకతో పెళ్లికి ఒప్పించుకున్నాడు.


Published Mar 31, 2025 08:10:00 PM
postImages/2025-03-31/1743432146_1743414416Manmarriedgoat202503fc655e82ae1292d027dcbd306031cde73x2.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హా....ఈ రోజు ప్రేమ గురించి ఈ రోజుల్లో మాట్లాడుకోవడం అంత కష్టమైన పనేం కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఏ వయసులోనైనా ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి తో బ్రేకప్ అయితే ఇంకా ఆవ్యక్తి మనసు విరిగిపోతుంది. అయితే రెండు మూడు సార్లు ప్రేమలో విఫలమైపోతున్నపుడు ఆ వ్యక్తి ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడు.


ఈ బ్రేకప్స్ బాధ పడలేక భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి మేకను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇంట్లో నానా తంటాలు పడి ఈ మేకతో పెళ్లికి ఒప్పించుకున్నాడు. జంతువులను ప్రేమిస్తే అవి మోసం చెయ్యవని అన్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో @famous.pulse అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. కొంతమంది సరదాగా, “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటున్నారు. ఒక యూజర్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఏ టైంలో అయినా మటన్ బిర్యానీ తినచ్చని మరికొందరు కామెంట్లు అంటున్నారు.


గతంలో ఇండోనేషియాలో సైఫ్ ఆరిఫ్ అనే 44 ఏళ్ల వ్యక్తి మేకను వివాహం చేసుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. తప్పులేదని కొందరు...ప్రేమ గుడ్డిదని మరికొందరు మెసేజ్ చేస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news wedding goat-milk

Related Articles