కోర్టు నోటీసులతో వచ్చినా లోపలికి పంపడం లేదని తన సమస్యను పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి రిక్వస్ట్ చేశాడు .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మంచు ఫ్యామిలీ రచ్చ మళ్లీ మొదలైంది. నిన్న తన కారు పోయిందని పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్ ఇదంతా తన అన్న మంచు విష్ణు చేయిస్తున్నాడంటూ ఆరోపించాడు. దీంతో ఈ రోజు ఉదయం జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నాడు. గేటు ముందే కూర్చొని తన బైఠాయించి నిరసన తెలిపారు.
మేం ఆస్తి గొడవలు పడడం లేదు. కాని ఎందుకు నన్నుఇంట్లోకి అనుమతించడం లేదు. నా వస్తువులు చాలా ఉన్నాయి. తన జుట్టు విష్ణు చేతిలో పెట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో తన పెట్స్ , వస్తువులు కోసం వచ్చానని తెలిపారు. తనకి ఆస్తి వద్దని ఎప్పుడో తన తండ్రికి చెప్పానని ఇది ఏ మాత్రం ఆస్తిగొడవ కాదని చెప్పారు.
ఇక ఈ నెల 1న పాప పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్ కు వెళ్లిన తర్వాత విష్ణు ప్లాన్ చేసి ఇదంతా చేశారని ఆరోపించారు. తెల్లవారుజామున విష్ణు అనుచరులు వచ్చి కార్లను తీసుకెళ్లడంతో పాటు తన సెక్యూరిటీపై దాడి చేశారని మనోజ్ తెలిపారు. కమిషనర్ ఇచ్చిన బైండోవర్‌ను వాళ్లు ఎన్నోసార్లు దాటారని, దొంగతనం గురించి చెప్పినా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదన్నారు. అసలు తన ఇంట్లోకి తను వెళ్లకుండా ఉంచడానికి అనుమతులు ఎందుకని తనుప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. కోర్టు నోటీసులతో వచ్చినా లోపలికి పంపడం లేదని తన సమస్యను పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి రిక్వస్ట్ చేశాడు .