Manchu Manoj: విష్ణు వల్ల నాకు ప్రాణహాని ఉంది !

తన ఏడు పేజీల ఫిర్యాదు లో ప్రధానంగా ఏడు అంశాలను ప్రస్తావించారు. కాగా వినయ్ అనే వ్యక్తి వల్ల కూడా తనకు ప్రాణ హాని ఉన్నట్లు తెలిపారు.


Published Dec 23, 2024 08:33:00 PM
postImages/2024-12-23/1734966243_mohanbabumanchuvishnumanchumanoj941733731495.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  మోహన్ బాబు కుటుంబ కలహాలు ఇంకా మంటలు రేగుతూనే ఉన్నాయి. మోహన్ బాబు చిన్నకొడుకు మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. తన అన్నయ్య విష్ణుతో జరుగుతున్న గొడవలు వల్ల తనకు ప్రాణహాని ఉందని తెలిపారు మనోజ్. తన ఏడు పేజీల ఫిర్యాదు లో ప్రధానంగా ఏడు అంశాలను ప్రస్తావించారు. కాగా వినయ్ అనే వ్యక్తి వల్ల కూడా తనకు ప్రాణ హాని ఉన్నట్లు తెలిపారు.


ఇటీవల హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలో మోహన్ బాబు నివాసం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. మంచు విష్ణువర్గం , మనోజ్ వర్గం పోటాపోటీగా కొట్టుకున్నారు. మీడియా ప్రతినిధులపై కూడా మోహన్ బాబు దాడి చేశారు. అయితే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. 


అటు, ఉద్రిక్తతలకు దారి తీసే ఎలాంటి చర్యలకు పాల్పవడవద్దంటూ మంచు విష్ణు, మంచు మనోజ్ లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంతలోనే మళ్లీ మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదానికి ఇప్పట్లో ముగింపు పడదన్న విషయం అర్థమవుతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu police manchu-family manchu-manoj manchu-vishnu

Related Articles