Manmohan Singh: నిగమ్ బోధ్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర !

నిగమ్ బోధ్ ఘూట్ లో మన్మోహన్ అంతక్రియలు జరుగుతున్నాయి. సైనిక లాంఛనాలతో కేంద్రప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించనుంది.


Published Dec 28, 2024 11:36:00 AM
postImages/2024-12-28/1735366084_qaamus98manmohan625x30028December24.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. ఢిల్లీ లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్ ఘూట్ సమీపంలో ఉన్న నిగమ్ బోద్ ఘూట్ వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. మన్మోహన్ ను తరలిస్తున్న వాహనంలో ..ఆయన పార్ధివదేహం పక్కన రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయన కుతూరు రావడంతో నిగమ్ బోధ్ ఘూట్ లో మన్మోహన్ అంతక్రియలు జరుగుతున్నాయి. సైనిక లాంఛనాలతో కేంద్రప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించనుంది.


మన్మోహన్ పార్థివదేహాన్ని ఈ ఉదయం ఆయన నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన పార్ధివదేహానికి పార్టీనేతలు , కార్యకర్తలు నివాళి అర్పించారు. మన్మోహన్ సింగ్ పార్ధివదేహానికి సోనియాగాంధీ , మల్లి కార్జున ఖర్గే , రాహుల్ గాంధీ , ప్రియాంకా గాంధీ , రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మన్మోహన్ భార్య గుర్ శరణ్ కౌర్ , ఆయన కుమార్తె పార్ధివదేహం వద్ద ఉన్నారు.


మరోవైపు మన్మోహన్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu central-government died manmohan-singh

Related Articles