Varanasi Railway Station: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం !

స్థానిక పోలీసు బృందంతో పాటు 12 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు మంటలను ఆర్పేందుకు ప్ర‌మాద‌ స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.


Published Nov 30, 2024 01:06:00 PM
postImages/2024-11-30/1732952244_378669ire.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ లోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలో శనివారం తెల్లవారే భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అక్కడున్న దాదాపు 200 బైకులు కాలి బూడిదయ్యాయి.వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిల్ సిబ్బంది, పోలీసుశాఖ అధికారులు మంటలను అదుపు చేశారు.గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), స్థానిక పోలీసు బృందంతో పాటు 12 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు మంటలను ఆర్పేందుకు ప్ర‌మాద‌ స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.

అయితే ప్రమాదంలో 200 బైకుల మాత్రం కాలి బూడదయినట్లు తెలిపారు. ప్రాణ నష్టం కాని ఎవ్వరికి గాయాలు కాని జరగలేదని తెలిపారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో దగ్ధమైనబైకులు ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని తెలిపారు. ఈ ఘటనను రెండు గంటల పాటు ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu fire-accident railwaystation fire-engines uttarpradesh

Related Articles