ఆయన చేసిన మరో సినిమానే 'మెకానిక్ రాకీ'. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా . అయితే కథేంటో చూసేద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: విశ్వక్ సేన్ ..మంచి యూత్ ఫుల్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరో. అయితే ఈ రోజు విశ్వక్ సినిమా మెకానిక్ రాకీ సినిమా థియేటర్ కు వచ్చింది. అయితే విశ్వక్ కొత్త కొత్త స్టోరీస్ కోసం .. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. అలా ఆయన చేసిన మరో సినిమానే 'మెకానిక్ రాకీ'. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా . అయితే కథేంటో చూసేద్దాం.
హైదరాబాదులోని 'మలక్ పేట'లో రాకేశ్ ఒక గ్యారేజ్ నడుపుతూ ఉంటాడు. అతన్ని అందరు రాకీ అంటుంటారు. కార్లు రిపేర్ చెయ్యడమే కాకుండా కారు డ్రైవింగ్ కూడా నేర్పుతూ ఉంటాడు. పుట్టుకతో తల్లి కోల్పోయిన రాకేశ్ ను అతని తండ్రి రామకృష్ణ ఏ లోటు లేకుండా పెంచుతాడు. అయితే చదువు మీద పెద్దగా ఇంట్రస్ట్ లేకపోవడంతో గ్యారేజ్ చూసుకోమని చెప్పి తండ్రి అతని చేతిలో పెడతాడు.
కాలేజ్ రోజుల్లో రాకీకి శేఖర్ మంచి స్నేహితుడు. అతని చెల్లెలైన ప్రియని చూడగానే రాకీ మనసు పారేసుకుంటాడు. అయితే కాలేజీ మానేయడంతో ఆ పరిచయం అక్కడితో ఆగిపోతుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రియ తారసపడుతుంది. తర్వాత రాఖీకి తెలుస్తుంది. ప్రియ తండ్రి చనిపోయాడని ..తన ఫ్రెండ్ శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. అప్పటి నుంచి ఫ్యామిలీ అంతా ప్రియ పైనే పడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే రంకిరెడ్డి (సునీల్) ఎంట్రీ ఇస్తాడు. రాకీ గ్యారేజీ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి సునీల్ ప్రయత్నిస్తుంటాడు. ఈ టెన్షన్స్ తన తండ్రికి ఉండకూడదని ఆయనని తన తండ్రిని యాత్రలకు పంపిస్తాడు. యాత్రలో తన తండ్రి చనిపోయినట్లు పేపర్ లో వార్త వేయిస్తాడు. ఇలాంటి టైంలో మాయ అనే అమ్మాయికి డ్రైవింగ్ నేర్పిస్తూ కాస్త క్లోజ్ అవుతాడు.
రామకృష్ణ చనిపోయాడని తెలియగానే ఆ గ్యారేజ్ ను ఆక్రమించడానికి రంకి రెడ్డి రంగంలోకి దిగుతాడు. ఆ గ్యారేజ్ జోలికి రావొద్దని రాకీ అతనిని బ్రతిమాలతాడు. అందుకు 50 లక్షలు ఇస్తానని చెబుతాడు. 10 రోజులలో 50 లక్షలు ఇవ్వకపోతే ఆ గ్యారేజ్ ను ఆక్రమించుకుంటానని రంకి రెడ్డి గడువు పెడతాడు. అసలు డబ్బులు ఎలా అడ్జెస్ట్ చేశాడు...ఇందులో ప్రియ అన్నయ్య కు ఏం సంబంధం అనేది సినిమాలో చూడాల్సిందే.
విష్వక్సేన్ .. మీనాక్షి చౌదరి .. శ్రద్ధా శ్రీనాథ్ .. నరేశ్ .. సునీల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. విష్వక్సేన్ కాస్త బరువు పెరిగినట్టుగా కనిపించాడు. ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. హర్ష, ఆది లను ఇంకా బాగా వాడుకోవచ్చు. హోప్ ఉంది కాని వాడుకోలేకపోయారు. మ్యూజిక్ పెద్దగా లేదు. సినిమా కోసం థియేటర్ కు రప్పించేంత కథ కాలు కాని ఎలాంటి ఎక్స్ పర్టేషన్స్ లేకుండా ఏదో టైం పాస్ కు అయితే చూడొచ్చు.