ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కుంటూ తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరైంది. దాదాపు గంటన్నర పాటు సాగిన వాద ప్రతివాదనల అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ ఇస్తున్నట్టు తీర్పునిచ్చింది.
న్యూస్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కుంటూ తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరైంది. దాదాపు గంటన్నర పాటు సాగిన వాద ప్రతివాదనల అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ ఇస్తున్నట్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో కవిత మీద వచ్చినవన్నీ ఆరోపణలే అని.. ఈడీ, సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని సుప్రీంకోర్టు తెలిపింది.
అయితే.. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ వచ్చిన కవిత ఈరోజు సాయంత్రం వరకు తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ధర్మాసనం ఇచ్చిన తీర్పు పత్రాలను ఆమె తరపు న్యాయవాదులు జైలు అధికారులకు అందించగానే.. కవిత విడుదల ప్రక్రియ పూర్తవుతుంది. దాదాపు సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో కవిత జైలు నుంచి బయటకు రానున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు కేటీఆర్, హరీశ్ రావులతో పాటు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ఢిల్లీ చేరుకున్నారు. కవితకు బెయిల్ మంజూరు కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. హైదరాబాద్ తో పాటు.. జిల్లాల్లో సైతం బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టాయి.