టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న ఆయన.. సహాయక చర్యలు కొనసాగించేందుకు వాయనాడ్ వెళ్లారు. రెస్క్యూ ఆపరేషన్‌లలో పాల్గొన్న సిబ్బంది అందరి మనోధైర్యాన్ని పెంచారు.
న్యూస్ లైన్ డెస్క్: కేరళలోని వయనాడ్ వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 338కి చేరిందని అధికారులు వెల్లడించారు. జులై 26న వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణనష్టం నష్టం జరిగింది. ఇప్పటికీ పలువురి ఆచూకీ తెలియకుండా పోయింది. అంతేకాకుండా వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలో సుమారు 40 బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే పలువురు వ్యాపారవేత్తలు, సినీ నటులు వాయనాడ్ బాధితులు, మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తోచినంత సహాయం చేస్తూ.. తమ గొప్ప మనుసుని చాటుకుంటున్నారు. ఇపప్టికే గౌతమ్ అదానీ, హీరో విక్రమ్, సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా, హీరో మోహన్‌లాల్ వాయనాడ్ విపత్తు వేళ తన వంతు సహాయం చేసేందుకు స్వయంగా అక్కడికి చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న ఆయన.. సహాయక చర్యలు కొనసాగించేందుకు వాయనాడ్ వెళ్లారు. రెస్క్యూ ఆపరేషన్‌లలో పాల్గొన్న సిబ్బంది అందరి మనోధైర్యాన్ని పెంచారు.