ప్రస్తుతం ప్రపంచ దేశాలను వనికిస్తున్నటువంటి వైరస్ మంకిఫాక్స్. దీనివల్ల ఇండియా కంటే ఎక్కువ ఆఫ్రికా దేశాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ మెల్లిమెల్లిగా ఇండియాలోకి కూడా
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచ దేశాలను వనికిస్తున్నటువంటి వైరస్ మంకిఫాక్స్. దీనివల్ల ఇండియా కంటే ఎక్కువ ఆఫ్రికా దేశాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ మెల్లిమెల్లిగా ఇండియాలోకి కూడా వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. భారత్ లో ఇప్పటికే మొదటి కేసు నమోదు అయినట్టు సమాచారం. ఒక వ్యక్తి మంకీ ఫాక్స్ అధికంగా సోకుతున్నటువంటి దేశాలకు వెళ్లి వచ్చాడని దాని ద్వారా ఆయనకు సోకిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
ప్రజెంట్ ఆ వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచామని, ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని తెలియజేశారు. అయితే మంకీ ఫాక్స్ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ మంకీ ఫాక్స్ ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తోంది, దాని లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మంకీ ఫాక్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాప్తిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడే వారి దగ్గరికి మనం వెళ్లి టచ్ అయినప్పుడు లేదంటే వారితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా యువకుల్లోనే ఈ మంకీ ఫాక్స్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, 18 నుంచి 33 సంవత్సరాల వారికి ఎక్కువగా మంకీ ఫాక్స్ వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలియజేస్తోంది. డబ్ల్యుహెచ్ ఓ తెలిపిన దాని ప్రకారం ఇప్పటివరకు మంకీ ఫాక్స్ సోకిన వారిలో 96.4 శాతం మంది 34 సంవత్సరాలు లోపు ఉన్నవారే అని తెలియజేసింది. ఇందులో మహిళలు, పురుషులు కూడా ఉన్నారని అన్నది.
అయితే మంకీ ఫాక్స్ సోకిన సందర్భంలో పెద్దపెద్ద మొటిమలతో పాటు దద్దుర్లు వస్తాయని, అరచేతులు, గొంతు, నోరు, ముఖం ఇతర జననేంద్రియాపై దద్దుర్లు కనిపిస్తాయని తెలియజేశారు. మనిషికి జ్వరం వచ్చి అలసట అయిపోతాడని, ఇది సోకిన 21 రోజుల్లో కనిపిస్తుందని ప్రభావం రెండు నుంచి మూడు వారాల వరకు ఉంటుందని తెలియజేశారు. కాబట్టి మంకీ ఫాక్స్ అరికట్టడానికి మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది.