ఆస్తులు ఉండటం కాదు.. ఉన్నప్పుడే నలుగురికి అన్న ం పెట్టాలి అని నిరూపించారు ముకేశ్ అంబానీ. కొడుకు పెళ్లి సందర్భంగా 45 రోజుల పాటు రోజుకు 5 వేల మందికి భోజనాలు పెట్టారు.
న్యూస్ లైన్ డెస్క్ : ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఎంత అంగరంగ వైభవంగా చేశారో అందరం చూశాం. పది మంది.. నాలుగు కాలాల పాటు గుర్తు పెట్టకునేంత వైభవంగా వివాహ వేడుక జరిపించారు. పలు రంగాల సెలబ్రిటీలు చేసిన హంగామా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆరు నెలల కిందటే పెండ్లి వేడుకలు ప్రారంభించి.. మార్చిలో మూడు రోజుల పాటు గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ నిర్వహించారు. జులై 12 నుంచి మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరిగాయి.
అంబానీ పెళ్లంటే ఎంతమందికి భోజనాలు పెట్టి ఉంటారా అని ఓ డౌట్ వచ్చి ఉంటుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 45 రోజుల పాటు 9వేల మంది పేదలు, నిరాశ్రయులకు అన్నదానం చేస్తోంది. ముంబైలోని అంబానీ ఇంటి ముందు ముకేశ్ అంబానీ పంచభక్ష్య పరమాన్నాలతో అన్నదానం నిర్వహించింది. రూ. 5 కోట్ల ఖర్చు పెట్టి చేసిన ఈ పెళ్లి సందర్భంగా నిరుపేదలు, కూలీలు, పేదలకు అన్నదానం చేస్తే మంచిదని పండితులు చెప్పడంతో ముకేశ్ అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారట.
జూన్ 5న మొదలైన ఈ అన్నదానం జులై 15 వరకు రోజుకు రెండుపూటలా కొనసాగిందట. రోజుకు కనీసం 5 వేలమంది భోజనం చేశారట. అంతేకాదు.. 50 జంటలకు వివాహం జరిపించి వారికి నగదు, బంగారు ఆభరణాలు అందించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. రిలయన్స్ లో పనిచేసే ఉద్యోగులందరికీ స్పెషల్ గిఫ్టులు పంపి.. ఉద్యోగుల ఇళ్లలో కూడా సంతోషాన్ని నింపారు.