ఆమె ఖాతాలో నుంచి రూ. 1. 78 లక్షలు కొట్టేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. విచారణ పేరుతో బట్టలు విప్పించి ..అమానుషంగా ప్రవర్తించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనీ లాండరింగ్ కేసులు చాలా దారుణంగా పెరిగాయి.ఓ యువతిని బెదిరించిన కేటుగాళ్లు ఆమె ఖాతాలో నుంచి రూ. 1. 78 లక్షలు కొట్టేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. విచారణ పేరుతో బట్టలు విప్పించి ..అమానుషంగా ప్రవర్తించారు.
ముంబైలోని బోరీవాలి ఈస్ట్ కు చెందిన ఓ యువతికి నవంబర్ 19న ఓ కాల్ వచ్చింది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ దుండగులు ఆమె పేరు, ఇతరత్రా వివరాలు చెప్పారు.మనీల్యాండరింగ్ కేసులో మీ పేరు కూడా ఉందంటు టెన్షన్ పెట్టారు. ప్రస్తుతం జైలులో ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేశ్ గోయెల్ కేసులో తన పేరున్నట్లు తెలిపారు. ఆ పై వాట్సాప్ వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. విచారణకు సహకరించాలని కోరుతూ ఇంట్లో చాలా ఇబ్బందిగాఉం డడమే కాకుండా ..అందరికి తెలిసిపోతుందంటూ తనని కంగారుపెట్టడం ఆ అమ్మాయి హోటల్ రూమ్ తీసుకొని అక్కడ విచారణకు సహకరించింది.
హోటల్ రూమ్ లో బాడీ చెకప్ చేయాలని యువతి దుస్తులు విప్పించారు. ఆపై సెక్యూరిటీ వెరిఫికేషన్ కోసమని చెప్పి రూ.1.78 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. విషయం పై మెల్లగా క్లారిటీ తెచ్చుకున్న అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. అందరికి తెలియజేసింది ఒక్కటే ఇండియన్ చట్టాల ప్రకారం డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని ..మీకు ఇలాంటి కాల్స్ వస్తే ..భయపడకుండా పోలీసులైనా కాని డిజిటల్ ఇంట్రగేషన్ లాంటి వి లేవని ...మీకు కావాలంటే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వస్తానని చెప్పండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.