పొరపాటు ఎవ్వరి వల్ల అయినా జరగొచ్చు..క్షమించాలి...కుదరకపోతే ..ఓ దెబ్బ వేసి ఊరుకోవాలి. అంతేకాని అధికారం చేతిలో ఉంది కదా..అని రివైంజ్ తీర్చుకుంటా అంటే ఎలా చెప్పండి. ఇలానే అమెరికా( america) ఎయిర్ పోర్ట్ లో ఓ అధికారి ..తనను సర్ అన్నందుకు ఓ తల్లికొడుకును ఫ్లైట్ ఎక్కకుండా ఆపేసింది. ఏంటి సర్ అన్నందుకే అంటారా ..అవును..సర్ అన్నందుకే ...ఆవిడ మేడం తెలీక సర్ అని అనేసిందట సదరు మహిళ
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పొరపాటు ఎవ్వరి వల్ల అయినా జరగొచ్చు..క్షమించాలి...కుదరకపోతే ..ఓ దెబ్బ వేసి ఊరుకోవాలి. అంతేకాని అధికారం చేతిలో ఉంది కదా..అని రివైంజ్ తీర్చుకుంటా అంటే ఎలా చెప్పండి. ఇలానే అమెరికా( america) ఎయిర్ పోర్ట్ లో ఓ అధికారి ..తనను సర్ అన్నందుకు ఓ తల్లికొడుకును ఫ్లైట్ ఎక్కకుండా ఆపేసింది. ఏంటి సర్ అన్నందుకే అంటారా ..అవును..సర్ అన్నందుకే ...ఆవిడ మేడం తెలీక సర్ అని అనేసిందట సదరు మహిళ.
మహిళా సిబ్బందిని (ladu staff)సర్ అని సంబోధించినందుకు తల్లీకొడుకులను విమానం ఎక్కకుండా ఆపేసింది ఆ మహిళ. టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా( jenna lagoria) తన కుమారుడు, తల్లితో కలిసి ఆస్టిన్‌కు( austin) వెళ్లేందుకు విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో విమానం ఎక్కే సమయంలో సిబ్బందికి తమ బోర్డింగ్ పాస్ అందజేశారు. ఈ క్రమలో జెన్నా.. లేడీ స్టాఫ్ ను మేల్ అనుకొని 'థ్యాంక్యూ సర్' అని సంబోధించింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె జెన్నాతో పాటు ఆమె తల్లి, బిడ్డను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంది.
ఈ క్రమంలో జెన్నా ( jenna) మరో సిబ్బంది సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేటు వద్దే ఆయన ఆపేశారని ఫిర్యాదు చేసింది. ఆ అటెండెంట్ 'ఆయన కాదు ఆమె' అని బదులిచ్చారు. తప్పు తెలుసుకున్న జెన్నా క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. విమానం ఎక్కనివ్వలేదు. దీంతో ఫ్లైట్ మిస్సై ...తన బాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది.