prabas: వారెవ్వా...ఇప్పుడు ఇండియాస్ బెస్ట్ హీరో మన ప్రభాసే !

టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఐదో ప్లేస్ దక్కించుకోగా, మహేశ్ బాబు 7వ, రామ్​చరణ్ 8వ ప్లేస్​ల్లో ఉన్నారు. ఆర్మాస్  ప్రకటించిన హీరోల లిస్ట్ ఎలా ఉందంటే..


Published Jan 19, 2025 07:47:00 PM
postImages/2025-01-19/1737296294_PrabhasPrabhasfilmsSouthernCinemaTeluguCinemaPrabhas22yearsjpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇండియా లో టాప్ హీరో ప్రభాసే. ఇది మనం అనుకుంటే సరిపోతుందా ...కాదు మనం అనుకోవడం కాదు.ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ (Ormax) తాజాగా విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ సెలబ్రిటీల జాబితాలో టాలీవుడ్ స్టార్ల​ పేర్లు మార్మోగిపోయాయి. 2024 డిసెంబర్ లో టాప్ యాక్టర్స్ లిస్ట్ ను ఆర్మాక్స్ బయటపెట్టింది. ఇందులో హీరో లిస్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్ మన సమంత. 
ప్రభాస్ తర్వాత 'పుష్ప 2'తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఐదో ప్లేస్ దక్కించుకోగా, మహేశ్ బాబు 7వ, రామ్​చరణ్ 8వ ప్లేస్​ల్లో ఉన్నారు. ఆర్మాస్  ప్రకటించిన హీరోల లిస్ట్ ఎలా ఉందంటే..


1. ప్రభాస్

2. అల్లు అర్జున్

3. విజయ్

4. షారుక్ ఖాన్

5. జూనియర్ ఎన్టీఆర్

6. అజిత్ కుమార్

7. మహేశ్ బాబు

8. రామ్​చరణ్

9. సల్మాన్ ఖాన్

10. అక్షయ్ కుమార్


 హీరోయిన్స్ లో అయితే ఫస్ట్ సమంత , తర్వాత అలియా భట్ ..ఆ తర్వాత రష్మిక మందన్నా ఉన్నారట. ఎంతైనా టాలీవుడ్ ఆర్టిస్ట్ లు టాప్ రేంజ్ లో ఉండడం చాలా హ్యాపీగా ఉందంటున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu jr-ntr allu-arjun hero-

Related Articles