Poolachokka Naveen: ‘పూలచొక్కా’ని చింపి పడేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్

యూట్యూబర్స్ కొంతమంది సినిమా రివ్యూస్ ఇస్తుంటారు. అది అందరికి తెలిసిందే అయితే వారందరిలో పూలచొక్కా...అదే నవీన్ రివ్యూస్ కి కాస్త క్రేజ్ ఉంది. అన్ని సార్లు రివ్యూలు పర్ఫెక్ట్ ఇవ్వాలంటే కష్టమే కదా...కొన్ని సార్లు బెడిసి కొడతాయ్ మరి.. పూలచొక్కా పేరు మాదిరే మనిషి కూడా చాలా చిత్ర విచిత్రంగానే ఉంటాడు. గతంలో బూట్ కట్ బాలరాజు సినిమా అప్పుడు.. ఈ ‘పూలచొక్కా’ బాగా పాపులర్ అయ్యాడు


Published Jul 09, 2024 06:28:00 PM
postImages/2024-07-09/1720530034_b0b23398fbbe4d5bb5fdd2a721d0e5d5.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  యూట్యూబర్స్ కొంతమంది సినిమా రివ్యూస్ ఇస్తుంటారు. అది అందరికి తెలిసిందే అయితే వారందరిలో పూలచొక్కా...అదే నవీన్ రివ్యూస్ కి కాస్త క్రేజ్ ఉంది. అన్ని సార్లు రివ్యూలు పర్ఫెక్ట్ ఇవ్వాలంటే కష్టమే కదా...కొన్ని సార్లు బెడిసి కొడతాయ్ మరి.. పూలచొక్కా పేరు మాదిరే మనిషి కూడా చాలా చిత్ర విచిత్రంగానే ఉంటాడు. గతంలో బూట్ కట్ బాలరాజు సినిమా అప్పుడు.. ఈ ‘పూలచొక్కా’ బాగా పాపులర్ అయ్యాడు. సొహైల్ ఇతన్ని తిట్టడం తిరిగి ఇతను కౌంటర్లు ఇవ్వడంతో.. ఇద్దరి మధ్య హాట్ టాపిక్ నడిచింది. లాస్ట్ లో సారీ చెప్పేసుకున్నారు కాని ..రివ్యూ నెగిటివ్ గా ఇచ్చినందుకు తిట్టుకున్నారు.  ఆ గొడవ అయిపోయింది. ఇప్పుడు కల్కీ మూవీ రివ్యూ ఇచ్చాడు నవీన్..దీని పై ఫుల్ ఫైర్ అయిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.


అయితే ఎప్పుడైతే ‘కల్కి’ లాంటి బ్లాక్ బాస్టర్ ...ఆ రేంజ్ సినిమా తియ్యాలంటే చాలా కష్టపడాలి...ఇలా ఈజీగా రివ్యూ ఇచ్చేస్తే ఎలా ...అందుకే రివ్యూ ఇచ్చినదగ్గర నుంచి ‘పూలచొక్కా’కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఇతను రివ్యూలలో చెప్తున్నట్టుగానే పుచుక్ పుచుక్‌మని అన్‌‌సబ్ స్క్రైబ్ కొట్టడం స్టార్ట్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.


 ఆ దెబ్బతో ఒక్కసారిగా.. 619K సబ్ స్క్రైబర్స్ ప్రస్తుతానికి 590Kకి పడిపోయింది. గంట గంటకూ ‘పూలచొక్కా’ యూట్యూబ్ ఛానల్ (poolachokka youtube) సబ్ స్క్రైబర్స్ తగ్గిపోతూనే ఉన్నారు. మరో సారి ...ఫేక్ రివ్యూస్ ఇచ్చావా ...చస్తావ్ అంటూ వార్నింగులు కూడా ఇస్తున్నారు. అసలు ఇంతకీ పూలచొక్కా ఏం చెప్పాడంటే..


* కల్కిలో అంత స్టఫ్ లేదు...ఫస్ట్ హాఫ్ చాలా స్లో ..ల్యాగ్ ఉందని చెప్పాడు.


* యాక్షన్ ఎపిసోడ్స్ అంత గొప్పగా లేదు..సో ఆడియన్స్ కి అంత నచ్చదని రివ్యూ లో చెప్పాడు.


* సినిమా మొత్తం గ్రీన్ మ్యాట్‌లోనే తీశారని తెలిసిపోతుంటుంది. రియల్ స్ట్రెక్చర్ ఫీల్ అయితే రాదు. చాలా క్యారక్టర్లు వస్తాయి పోతాయి...జైలర్ సినిమా ఎలివేషన్స్ కూడా లేవు.


* ఇలాంటి సినిమా తీసినందుకు నాగ్ అశ్విన్‌ని మెచ్చుకోవాలి. మనం డబ్బులు ఖర్చుపెట్టి చూస్తుంన్నందుకు అబ్బా అనే ఫీలింగ్ కూడా వస్తుంది.


* బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే ఓకే ఉంది.మిగిలిన పాటలు వరస్ట్ గా ఉన్నాయి.


* ప్రమోషన్స్‌లో బుబ్జీ బుజ్జీ అని చావగొట్టారు.. కీర్తి సురేష్ వాయిస్ బాగానే ఉంది కానీ.. కామెడీ అంత క్యూట్‌గా లేదు. ఫస్టాఫ్ యావరేజ్. సెకండాఫ్ డీసెంట్‌గా ఉంది.


* వావ్ ఏ సినిమారా బాబూ అనే ఫీలింగ్ కలగలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే టమొటోస్.. 2.95 భయ్యా..ఇంత కంటే ట్రై చేసినా ఇవ్వలేం. డబ్బులు వచ్చేస్తాయి కాని ..సూపర్ డూపర్ హిట్టు కాదంటు కామెంట్లు చేశాడు.


అతని రివ్యూపై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ‘నిద్ర మత్తులో సినిమా చూసినట్టున్నాడు సైకో సాలే గాడు.. కొంపతీసి ప్రభాస్ ‘కల్కి’ కాకుండా రాజశేఖర్ కల్కి సినిమా చూసి రివ్యూ ఇచ్చాడా? చీప్ లిక్కర్ తాగి సినిమా చూస్తే ఇలాంటి రివ్యూలే వస్తాయి’ అంతేనా ...సినిమా నువ్వెందుకు చూశావ్...బుర్ర ఉన్నవాళ్లు మాత్రమే సినిమా చూడాలని చెప్పారు గా అంటు కామెంట్లు పెడుతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : prabhas kalki-2898-ad newslinetelugu kalki-movie youtube

Related Articles