Pulasa Chepa: గోదావరికి పులస వచ్చేసింది..కేజీ 24 వేలే చీప్ వెరీ చీప్ !

వానాకాలం వచ్చిందంటే గోదావరి జనాల కళ్లు మెరుస్తాయి. పులస చేపల కోసం వేట మొదలుపెడతారు. పులస పడితే చాలు...ఆ చేపల వాని లైఫ్ మారిపోతుంది. మరి కేజీ పాతికవేలు అంటే మాటలా...ఎన్ని నెలలు చేపలు అమ్మాలి. ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని రుచే. గోదావరికి ఎదురు ఈదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలనుకుంటారు . ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత ఎలానూ ఉంది. కాస్ట్లీ చేప...అన్నమాట..మిడిల్ క్లాస్ వాళ్లకు అంత అందుబాటులో ఉండేది కాదు.


Published Jul 13, 2024 12:58:00 PM
postImages/2024-07-13/1720855720_120067519029220924190292201689670027281.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  వానాకాలం వచ్చిందంటే గోదావరి జనాల కళ్లు మెరుస్తాయి. పులస చేపల కోసం వేట మొదలుపెడతారు. పులస పడితే చాలు...ఆ చేపల వాని లైఫ్ మారిపోతుంది. మరి కేజీ పాతికవేలు అంటే మాటలా...ఎన్ని నెలలు చేపలు అమ్మాలి. ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని రుచే. గోదావరికి ఎదురు ఈదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలనుకుంటారు . ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత ఎలానూ ఉంది. కాస్ట్లీ చేప...అన్నమాట..మిడిల్ క్లాస్ వాళ్లకు అంత అందుబాటులో ఉండేది కాదు.


తాజాగా గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో ఓ జాలరి వలలో పులస చిక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక జాలర్ల వలలో దాదాపు కేజీన్నర బరువున్న పులస చేప పడింది. ఆ వెంటనే దానిని మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ. 24 వేలకు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఇక నుంచి ...పులసలు చిక్కుతాయని భారీ గా దొరకక పోయినా ...పులుస చేపలు దొరుకుతాయని అంటున్నారు జాలర్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news fish

Related Articles