Shine Tom Chacko: 'నార్కోటిక్స్' రైడ్‌..లో హోటల్ నుంచి పరుగులు పెట్టిన యాక్టర్ !

సెంకడ్ ఫ్లోర్ లోకి దూకి మెట్ల మార్గంలో పరుగులు తీసి బయటకు వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


Published Apr 17, 2025 06:03:00 PM
postImages/2025-04-17/1744893296_shinetomchacko.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఫేమస్ మలయాళం యాక్టర్ చాకో కష్టకాలం మొదలైంది. కొచ్చిలోని ఓ హోట‌ల్‌లో డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌నే స‌మాచారంతో నార్కోటిక్ సిబ్బంది రైడ్ చేయ‌గా ఆయ‌న పారిపోయారు. అయితే ఆయన మూడో అంతస్తు కిటికీ నుంచి సెంకడ్ ఫ్లోర్ లోకి దూకి మెట్ల మార్గంలో పరుగులు తీసి బయటకు వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


ఎర్నాకుళం జిల్లాలోని ఒక హోటల్‌లో జిల్లా నార్కోటిక్ నిరోధక ప్రత్యేక దళం (DANSAF) ప్రత్యేకంగా చాకోను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు నిర్వహించింద‌ని స‌మాచారం.  చాకో త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని విన్సీ అలోషియస్ అనే న‌టి మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA)లో ఫిర్యాదు చేశారు 


'సూత్రవాక్యం' సినిమా షూటింగ్ లో చాకో తనతో తప్పుగా ప్రవర్తించారని ...తన ముందే బట్టలు మార్చుకోవాలని చాలా ఇబ్బందిపెట్టేవారని  మలయాళం యాక్టర్ కంప్లైయింట్ చేశారు ఈ నేప‌థ్యంలో ఆమె త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వివరణాత్మక వీడియోను షేర్ చేశారు. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత నుంచి తాను ఇకపై మాదకద్రవ్యాలు ఉపయోగించే నటులతో న‌టించ‌కూడద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఆమె వీడియోలో తెలిపారు. దీనిపై కేరళ పోలీసులు రియాక్ట్ అయ్యారు. నార్కోటిక్స్ రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్ నుంచి తప్పించుకోవడానికి చాకో ఇలా పరుగులు తీశారు.


 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu malayala-industry drugs-case

Related Articles