VIRAL : క్యాసినోలో 4 మిలియన్లు గెలిచిన వ్యక్తి ..ఆనందంతో హార్ట్ అటాక్ 2024-06-25 17:53:00

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సింగపూర్ ( SINGAPORE)     లో ఓ వింత సంఘటన జరిగింది. పాపం గెలవక గెలవక ఓ వ్యక్తి క్యాసినోలో 4 మిలియన్లు గెలిచాడు. ఓ గంట సేపు గెలిచిన ఆనందంలో తెగ తబ్బిఉబ్బిపోయాడు. తర్వాత తట్టుకోలేక ...ఆనందం భరించలేక హార్ట్ అటాక్( HEART ATTACK)  తో చనిపోయాడు. పాపం జాక్ పాట్ ను అనుభవించకుండానే చనిపోవడంతో బాధపడుతున్నారు .


సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ క్యాసినోలో( CASINO)  భారీ మొత్తంలో జాక్‌పాట్‌ ( JACKPOT) తగిలిందన్న ఆనందాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఓ వ్యక్తి . ఒక్కసారిగా తట్టుకోలేనంత సంతోషం కలగడంతో కార్డియాక్‌ ( CARDIC ARREST) అరెస్ట్‌కు గురైన వ్యక్తి.. అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. 


చుట్టుప్రక్కల జనాలు... క్యాసినో యాజమాన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా సీపీఆర్ (CPR) చేసినా వ్యక్తి బతకలేదు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ( SOCIAL MEDIA) వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. క్యాసినోలో వ్యక్తి కుప్పకూలిన వెంటనే సీపీఆర్ చేయాలని ఒక్కరు కూడా ప్రయత్నించలేదని కొందరు... సీపీఆర్‌ చేసి ఉంటే బతికేవాడని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కాదు, విష ప్రయోగం జరిగి ఉంటుందని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు