ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతరపూర్ జిల్లాకు చెందినటువంటి ఒక యువకుడి కడుపులో రెండున్నర అంగుళాలు ఉన్నటువంటి సొరకాయను వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఆ వ్యక్తికి అసలు ఆ కడుపులోకి సొరకాయ ఎలా వెళ్ళింది. అనే వివరాలు చూద్దాం..
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతరపూర్ జిల్లాకు చెందినటువంటి ఒక యువకుడి కడుపులో రెండున్నర అంగుళాలు ఉన్నటువంటి సొరకాయను వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఆ వ్యక్తికి అసలు ఆ కడుపులోకి సొరకాయ ఎలా వెళ్ళింది. అనే వివరాలు చూద్దాం..
అయితే వ్యక్తి విపరీతమైనటువంటి కడుపునొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్ళాడు. దీంతో వైద్యులు అతనికి కడుపుని ఎక్స్ రే తీశారు. కానీ కడుపులో ఏదో ఆకారం కనిపిస్తుందని షాక్ అయిపోయారు. వెంటనే దాన్ని ఆపరేషన్ చేసి తీయకుంటే యువకుడికి ప్రమాదం అని చెప్పారు. వెంటనే వైద్య బృందమంతా కలిసి ఆ వ్యక్తికి ఆపరేషన్ నిర్వహించారు. దీంతో అతని కడుపులో నుంచి ఒక పొడవాటి సొరకాయను బయటకు తీశారు.
అయితే ఇదే విషయమై ఆపరేషన్ చేసిన డాక్టర్ నందకిషోర్ జాదవ్ మాట్లాడుతూ రోగిని ఎక్స్ రే చేశాక మేమంతా షాకయ్యామని, అతని కడుపులో వింత ఆకారం కనిపించిందని వెంటనే ఆపరేషన్ చేసి బయటకు తీయగా, కడుపులో సొరకాయ ఉన్నదని అన్నారు. ఈ సొరకాయ కడుపులోకి వెళ్లడం వల్ల ఆయన తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారని, ఈ సొరకాయ మలద్వారం ద్వారా కడుపులోకి చొప్పించబడిందని దీని వల్ల అతని సిరలు మొత్తం పగిలిపోయాయని, రోగి పరిస్థితి విషమంగా ఉన్న సమయంలోనే ఆయన ఆసుపత్రికి వచ్చారని తెలియజేశారు. అయితే ఆ వ్యక్తి మానసిక పరిస్థితి కూడా బాగాలేదని, మొత్తానికి సొరకాయను బయటకు తీశామని తెలియజేశారు.