ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతూ సంచలన ప్రకటన చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతూ సంచలన ప్రకటన చేశారు. కుస్తీ నాపైన గెలిచిందని... అందుకే తాను ఓడిపోయానని ప్రకటించారు. తనను క్షమించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు దినేష్ ఫోగట్. కొన్ని కోట్ల భారతీయుల కల విఛ్ఛిన్నమైపోయిందంటూ తన బాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ నిర్ణయానిక యావత్తు భారత్ ....ఆశ్చర్యపోయింది.
తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది "అమ్మా, నా నుండి రెజ్లింగ్ గెలిచింది, నేను ఓడిపోయాను, క్షమించండి, మీ కల, నా ధైర్యం, ప్రతిదీ విచ్ఛిన్నమైంది, ఇప్పుడు నాకు ఇంతకంటే బలం లేదు. కుస్తీకి గుడ్‌బై 2001-2024. అమ్మా నన్ను క్షమించు అంటూ క్షమాపణలు చెప్పింది. 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసింది. తన అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ లో నిరసన వ్యక్తం చేసింది.
వినేష్ ఫోగాట్ తన పోటీదారుతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 5-0 తేడాతో గెలిచింది. అంతేకాకుండా ఒలింపిక్ ఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా రికార్డులు సృష్టించింది. షాక్ లో అభిమానులు 2001లో రెజ్లర్‌గా అరంగేట్రం చేసిన వినేశ్ 29 యేళ్ల వయసులో రిటైర్‌మెంట్ ప్రకటించడం ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ పోస్ట్ కు లక్షల్లో కామెంట్లు పెట్టారు. ధైర్యం చూపించు ...భారత్ నీలాంటి గొప్ప క్రీడాకారిణిని పోగొట్టుకోలేదు. దయచేసి ఇలాంటి వీడ్కోలు ఇవ్వొద్దంటు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ గోల్డ్ మెడల్ సాధించేందుకు 2028 LA గేమ్స్‌పై దృష్టి పెట్టాలని కోరారు. అయినప్పటికీ వినేష్ మనోధైర్యం కోల్పోయారు. చివరి యుద్ధంలో ఓడిపోయానని, ఇకపై కొనసాగించడానికి ఏమీ మిగల్లేదని ఉద్వేగానికి గురయ్యారు. తన బాధలో అర్ధముందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
अलविदा कुश्ती 2001-2024
Tags : olympic2024- vinesh-phogat wrestling disqualified