ప్రభుత్వం పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. అయితే సీనియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను సైతం ఎదిరిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రభుత్వం పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. అయితే సీనియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను సైతం ఎదిరిస్తున్నారు. ఈ ఘటన మంగళవారం మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. లక్సెట్టిపేటలోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే ముగ్గురు విద్యార్థులు జూనియర్స్‌ను ర్యాగింగ్ చేశారు. అయితే ర్యాగింగ్ చేయకూడదని ప్రిన్సిపాల్ చెప్తే ప్రిన్సిపాల్‌ను సైతం విద్యార్థులు ఎదురించారు.
ఉదయం సీనియర్లు, తరుణ్ అనే జూనియర్‌ను కొట్టడంతో కోపంలో తరుణ్ కిటికీ అద్దానికి చేతితో కొట్టాడు. దీంతో తరుణ్ చేతి నరం తెగిపోయి, తీవ్ర రక్తస్రావమైంది. కాగా, తరుణ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద చేరుకుని ఆందోళన చేపట్టారు. సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌ను డిమాండ్ చేశారు.